డీఎస్సీ లేదా టెట్‌లో మెథడాలజీలో అధిక మార్కులు సాధించేందుకు ప్రిపరేషన్ ఎలా ఉండాలి?
ఎన్.విజయ, అనకాపల్లి.
Question
డీఎస్సీ లేదా టెట్‌లో మెథడాలజీలో అధిక మార్కులు సాధించేందుకు ప్రిపరేషన్ ఎలా ఉండాలి?
- డీఎస్సీ/టెట్‌లో విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం మెథడాలజీ.
- మెథడాలజీలో ప్రతి ప్రశ్నకు ఇచ్చే నాలుగు ఆప్షన్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. దాంతో అభ్యర్థులు ఈ విభాగంలో చాలా తప్పులు చేస్తుంటారు.
- ఇందులో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా, అనువర్తనాలతో కూడి ఉంటాయి.
- మెథడాలజీలోని కీలకాంశాలు.. బోధనా లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు.
- అంశాలను కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అన్వయించుకుని ప్రిపరేషన్ సాగించాలి.
- భావనలను తరగతి, ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకుని అధ్యయనం చేయాలి.
- బోధన పద్ధతుల విషయంలో కొంత అయోమయం ఉంటుంది. ఏయే సబ్జెక్ట్‌కు ఏ పద్ధతి సరిపోతుందనే అంశంపై అవగాహన పెంచుకోవాలి.
- మెథడాలజీ కోసం రోజూ కనీసం 2 గంటల సమయం కేటాయించాలి.
- గత ప్రశ్నపత్రాలను, మోడల్ టెస్ట్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
- వివిధ మెటీరియల్స్‌పై ఆధారపడకుండా తెలుగు అకాడమీ పుస్తకాలకే పరిమితం కావాలి.