డీఎస్సీ-ఎస్‌ఏ పరీక్ష కోసం వ్యాపార గణితం అనే చాప్టర్‌కు ఎలా సిద్ధమవ్వాలో తెలపండి?
- టి.హరిణి, కొల్లూరు
Question
డీఎస్సీ-ఎస్‌ఏ పరీక్ష కోసం వ్యాపార గణితం అనే చాప్టర్‌కు ఎలా సిద్ధమవ్వాలో తెలపండి?
వ్యాపారగణితం, బీజగణితాలను ఒకే చాప్టర్‌గా సిలబస్‌లో పేర్కొన్నప్పటికీ అవి రెండూ విడివిడిగా అధ్యయనం చేయా ల్సిన విస్తృతమైన విభాగాలు. ముందుగా పాత ఎనిమిదో తరగతి గణిత పాఠ్యపుస్త కంలోని వ్యాపార గణితం అనే పాఠాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. నమూనా ప్రశ్నలను ఉప అంశాలవారీగా ప్రాక్టీస్ చేయాలి. వ్యాపార గణితం అనే శీర్షికలో పేర్కొన్న ఉప అంశాలు నిష్పత్తి- అనుపా తం, ఏక వస్తుమార్గం, డిస్కౌంటు, అంకగ ణిత సగటు, బారువడ్డీ, చక్రవడ్డీ, భాగ స్వామ్యం, కాలం- దూరం, కాలం-పని, గడియారం వంటివి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నాయి. వీటన్నింటినీ అధ్యయనం చేయాలి. ప్రత్యేకంగా క్యాలెండర్ సమస్యలను వీటితోపాటు ప్రాక్టీస్ చేయాలి. ప్రాథమికంగా వ్యాపార గణితం అనే చాప్టర్ అంక గణితానికి మరొక పేరు. ఎందుకంటే వ్యాపార రంగంలో అంకగణిత పరిక్రియలైన నిష్పత్తి, డిస్కౌంటు, వడ్డీ మొదలైన అనేక అంశాలు మిళితమై ఉంటాయి. వ్యాపార గణితంలోని విజ్ఞానం నిజ జీవితంతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటుంది. మనం ప్రతిరోజూ గణన చేసే అనేక లావాదేవీలకు కావలసిన పరిజ్ఞానానికి సంబంధించిన చాప్టర్ వ్యాపార గణితం. కాబట్టి నేడు బ్యాంకింగ్ లాంటి అనేక పోటీ పరీక్షల్లో ఇచ్చే సమస్యలన్నీ వ్యాపారగణితం చాప్టర్‌లో పేర్కొన్న ఉప అంశాలకు సంబంధించినవే. వ్యాపార గణితం సమస్యలను సులువుగా సాధించ డానికి సంక్షిప్త పద్ధతులను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా కాలం-పని, కాలం-వేగం, మొదలైన అంశాలపై ఇచ్చే సమస్యలను shortcut formulas (సంక్షిప్త సూత్రాలు) ద్వారా సాధించాలి. దీని కోసం ప్రత్యేకంగా సాధన చేయాలి.