బయాలజీ మెథడ్స్ విభాగంలో ‘లక్ష్యాలు- స్పష్టీకరణాలు’ పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి?
కె.సరళ, విజయవాడ
Question
బయాలజీ మెథడ్స్ విభాగంలో ‘లక్ష్యాలు- స్పష్టీకరణాలు’ పాఠ్యాంశం ప్రాధాన్యం ఏమిటి?
బయాలజీ మెథడ్స్ లో ‘లక్ష్యాలు- స్పష్టీకరణాలు’ పాఠ్యాంశానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈ చాప్టర్ నుంచి అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ప్రశ్నలు అడుగుతున్నారు. భావనలు అవగాహన చేసుకొని, వాటిని అన్వయించుకొని చదవాలి. జ్ఞానాత్మక రంగం నుంచి అవగాహనపై ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు. భావావేశ రంగానికి చెందిన అభిరుచి. అభినందన, శాస్త్రీయ దృక్పథం అనే లక్ష్యాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. మానసిక చలనాత్మక రంగానికి చెందిన నైపుణ్యాలలో పరిశీలన, సేకరణ, చిత్రలేఖనం, హస్తలాఘవం వంటి అంశాలను అన్వ య పద్ధతిలో చదవాలి.