Engineering Seats: ఇంజనీరింగ్ సీట్లు.. ఈడబ్ల్యూఎస్ కన్వీనర్ కోటాకే?
Sakshi Education
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ (ఈడబ్ల్యూఎస్) కన్వీనర్ కోటా కిందకే వస్తుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు అంటున్నారు.
ఇందుకు అనుగుణంగానే ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై త్వరలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. మొత్తం సీట్లలో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు వచ్చి ఉంటే... దాదాపు 8,400 అదనంగా ఉండేవి. కేవలం కనీ్వనర్ కోటా కింద ఉండే సీట్లను కొలమానంగా తీసుకోవడం వల్ల అదనంగా 6,200 వరకూ సీట్లు వచ్చే వీలుంది. అయితే, ఈడబ్ల్యూఎస్ కోటా కింద వేల సంఖ్యలో పోటీపడుతున్నారని అధికారులు అంటున్నారు. మొత్తం సీట్లను ప్రామాణికంగా తీసుకుని ఉంటే టాప్‌టెన్ కాలేజీల్లో మరికొంతమందికి అవకాశం లభించి ఉండేదని అధికారులు అంటున్నారు.
Published date : 08 Sep 2021 05:55PM