APPSC Group-II Screening Test Question Paper (TM) with Final Key (Held on 26.02.2017)
1. భారతదేశం నుంచి నిష్ర్కమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు?
1) ఇంగ్లిష్ గ్రామం
2) ఫ్రెంచ్ విల్లా
3) క్రూయిజ్ ఓడ
4) అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రిసార్ట్
- View Answer
- సమాధానం: 1
2. గణిత శాస్త్రంలో నోబెల్‌కు సమానమైన పురస్కారంగా దేన్ని భావిస్తారు?
1) ఫీల్డ్స్ మెడల్
2) న్యూటన్ మెడల్
3) రామానుజన్ మెడల్
4) పైథాగరస్ మెడల్
- View Answer
- సమాధానం: 1
3.‘ఒబామా కేర్’ అంటే?
1) సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టం
2) అందరికీ విద్య కోసం చట్టం
3) జాతి వివక్ష హింస నుంచి రక్షణ కోసం చట్టం
4) ఆశ్రయం లేనివారి సంరక్షణకు చట్టం
- View Answer
- సమాధానం: 1
4. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్?
1) బాన్‌కీ మూన్
2) కోఫీ అన్నన్
3) ఆంటోనియో గుటెర్రెస్
4) ఇరినా బొకోవా
- View Answer
- సమాధానం: 3
5. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు?
1) క్రిస్టీన్ లాగార్డ్
2) జోసెఫ్ స్టిగ్లిట్జ్
3) క్రిస్టలీనా జార్జీవా
4) జిమ్ యోంగ్ కిమ్
- View Answer
- సమాధానం: 1
6. రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
1) పి.జె.కురియన్
2) అరుణ్ జైట్లీ
3) హమీద్ అన్సారీ
4) షెల్జా కుమారి
- View Answer
- సమాధానం: 3
7. ‘హాఫ్ లయన్’ అనే పుస్తకాన్ని ఎవరి గురించి రాశారు?
1) సీతారాం కేసరి
2) రాజీవ్ గాంధీ
3) పి.వి.నరసింహారావు
4) మన్మోహన్ సింగ్
- View Answer
- సమాధానం: 3
8. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం?
1) ఇబ్రహీంపూర్
2) అకోదర
3) ధాసాయి
4) ఖండాలవాడి
- View Answer
- సమాధానం: 2
9. BHIM (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) అనే చరవాణిలోని అనువర్తనం కింది దానిపై ఆధారపడి ఉంది?
1) సెంట్రల్ పేమెంట్ ఇంటర్ఫేస్
2) లోకల్ పేమెంట్ ఇంటర్ఫేస్
3) యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్
4) వరల్డ్ పేమెంట్ ఇంటర్ఫేస్
- View Answer
- సమాధానం: 3
10. భారత నైపుణ్య సంస్థ శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు?
1) అలహాబాద్
2) లక్నో
3) పట్నా
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 4
11. ఐదో భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది?
1) దుబాయి
2) మస్కట్
3) ఖతార్
4) రియాద్
- View Answer
- సమాధానం: 2
12. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ఉద్ద్దేశం?
1) అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం
2) ఎల్ఈడీ బల్బుల వితరణ ద్వారా సమర్థ వెలుగును అందించడం
3) సౌరశక్తి ఉపకరణాలను ప్రోత్సహించడం
4) విద్యుత్ శక్తి అమ్మకానికి అనియంత్ర ప్రవేశం కల్పించడం
- View Answer
- సమాధానం: 2
13. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు?
1) ఎస్.క్రిస్టఫర్
2) ఆర్.చిదంబరం
3) వి.కె.సారస్వత్
4) జి.సతీష్ రెడ్డి
- View Answer
- సమాధానం: 4
14. 2012 లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పతకాన్ని, రజత పతకంగా పై స్థాయికి మార్చడానికి, కింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడం కారణం?
1) తోగ్రుల్ అస్గరోవ్
2) షరీఫ్ శరిపోవ్
3) జేక్ వార్నర్
4) బెసిక్ కుదుఖొవ్
- View Answer
- సమాధానం: ప్రశ్న తప్పుగా ఇచ్చారు కాబట్టి తొలగించారు.
15. భారతదేశపు కొత్త వాయు సేనాధిపతి ఎవరు?
1) బిపిన్ రావత్
2) బి.ఎస్.ధనోవా
3) సునిల్ లంబా
4) ఆరూప్ రాహా
- View Answer
- సమాధానం: 2
16. భారతీయ చరిత్ర కాంగ్రెస్ 77వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) చెన్నై
2) బెంగళూరు
3) తిరువనంతపురం
4) కొత్త ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
17. 2017, జనవరిలో ఇ- పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో, పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్‌కి బంగారు పతకం ఏ ప్రాజెక్టు వల్ల లభించింది?
1) ఆధార్‌తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ
2) రుణ మాడ్యూల్
3) రాష్ర్ట పెన్షన్ పోర్టల్
4) కోర్
- View Answer
- సమాధానం: 1
18. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి HRIDAY పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పట్టణం ఉంది?
1) తిరుపతి
2) శ్రీశైలం
3) విజయవాడ
4) అమరావతి
- View Answer
- సమాధానం: 4
19. బి.సి.సి.ఐ. పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్టు?
1) బెట్టింగ్‌ని నిషేధించాలని సూచించింది
2) బెట్టింగ్ గురించి ఏమీ తెలపలేదు
3) బెట్టింగ్‌ని న్యాయబద్ధం చేయాలని సూచించింది
4) బెట్టింగ్‌కి పాల్పడితే జైలుశిక్ష వేయాలని సూచించింది
- View Answer
- సమాధానం: 3
20. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2016 సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపర్చుకొన్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చింది?
1) పి.వి. సింధు
2) కరోలినా మారిన్
3) సన్ యూ
4) ఆయకా తాకాహాషీ
- View Answer
- సమాధానం: 1
21. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు?
1) అనిల్ గోయెల్
2) అనిల్ బైజాల్
3) విజయ్ గోయెల్
4) ప్రదీప్ బైజాల్
- View Answer
- సమాధానం: 2
22. రాజ్యాంగ అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు?
1) నందలాల్ బోస్
2) దీనానాథ్ భార్గవ
3) జతిన్ దాస్
4) కాను దేశాయ్
- View Answer
- సమాధానం: 2
23.తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు?
1) పాపినేని శివశంకర్
2) కాత్యాయనీ విద్మహే
3) ఆర్. చంద్రశేఖర రెడ్డి
4) వోల్గా
- View Answer
- సమాధానం: 1
24. చిరహరితే అంటే ఏమిటి?
1) మధ్యప్రదేశ్‌లో కనుగొన్న ఒక జింక జాతి
2) కర్ణాటకలో కనుగొన్న పొడవైన ఆకుల మొక్క
3) కేరళలో కనుగొన్న చెదల జాతి
4) తమిళనాడులో కనుగొన్న సీతాకోక చిలుకల జాతి
- View Answer
- సమాధానం: 3
25. కబడ్డీ ప్రపంచ కప్-2016ని ఏ దేశం గెలుచుకొంది?
1) భారతదేశం
2) థాయిలాండ్
3) ఇరాన్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 1
26. 2016 సంవత్సరానికి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారాన్ని జాతీయ స్థాయిలో గెలుచుకొన్న వారు ఎవరు?
1) రూప్ సింగ్
2) రాజిందర్ సింగ్
3) కృష్ణయాదవ్
4) అరుణ రాయ్
- View Answer
- సమాధానం: 3
27. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి?
1) తక్కువ బడ్జెట్ సేంద్రియ వ్యవసాయం
2) శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం
3) బహుళ అంచెల సేంద్రియ వ్యవసాయం
4) ప్రకృతి మిత్ర సేంద్రియ వ్యవసాయం
- View Answer
- సమాధానం: 2
28. భారత రాజ్యాంగ ప్రవేశికలో (పీఠికలో) తెలిపిన విధంగా, భారత్ ఒక?
1) సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం
2) సామ్యవాద సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం
3) లౌకిక సర్వసత్తాక ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యం
4) సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం
- View Answer
- సమాధానం: 4
29.రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ లో ఎన్ని ప్రాథమిక విధులను పేర్కొన్నారు?
1) 9
2) 10
3) 11
4) 12
- View Answer
- సమాధానం: 3
30. భారతదేశంలో ఆస్తిహక్కుకి భంగం కలిగితే ఈ కింది దాన్ని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేం?
1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్
2) న్యాయస్థానంలో సివిల్ వ్యాజ్యం
3) రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్
4) లోక్ అదాలత్‌లో వ్యాజ్యం
- View Answer
- సమాధానం: 3
31. భారతదేశంలో ఆస్తిహక్కుకి భంగం కలిగితే ఈ కింది దాన్ని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేం?
1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్
2) న్యాయస్థానంలో సివిల్ వ్యాజ్యం
3) రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్
4) లోక్ అదాలత్‌లో వ్యాజ్యం
- View Answer
- సమాధానం: 1
32.ఒక వ్యక్తిని భారత రాష్ర్టపతిగా ఎన్ని పర్యాయాలు ఎన్నిక చేయొచ్చు?
1) ఒకసారి
2) పరిమితి లేదు
3) రెండుసార్లు
4) వెంట వెంటనే రెండుసార్లు
- View Answer
- సమాధానం: 2
33. రాష్ట్రాల్లో రాష్ర్టపతి పాలన విధించే అంశంపై మైలురాయి లాంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఏ వ్యాజ్యంలో ఇచ్చింది?
1) గోలక్‌నాథ్
2) మేనకా గాంధీ
3) మినర్వా మిల్స్
4) ఎస్.ఆర్. బొమ్మై
- View Answer
- సమాధానం: 4
34. ఒక రాష్ర్ట సరిహద్దులను మార్చేందుకు లేదా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు?
1) ప్రభావితమయ్యే రాష్ర్ట విధాన సభ అంగీకారం కావాలి
2) ప్రభావితమయ్యే రాష్ర్ట విధాన సభ అభిప్రాయాన్ని రాష్ర్టపతి అడగాలి
3) ప్రభావితమయ్యే రాష్ర్ట విధాన సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి
4) ప్రభావితమయ్యే రాష్ర్టం లోక్‌సభకు సిఫార్సు చేయాలి
- View Answer
- సమాధానం: 2
35. కింది వాటిలో ఏ రిట్‌ని ప్రైవేటు వ్యక్తిపై కూడా దాఖలు చేయొచ్చు?
1) కోవారంటో
2) సెర్షియోరరి
3) హెబియస్ కార్పస్
4) మాండమస్
- View Answer
- సమాధానం: 3
36. కింది వాటిలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తారు?
1) 26 జనవరి
2) 30 జనవరి
3) 15 ఆగస్టు
4) 26 నవంబర్
- View Answer
- సమాధానం: 4
37. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రముఖ సమాఖ్య లక్షణాన్ని సూచించడం లేదు?
1) ఆర్థిక వనరుల కేటాయింపు
2) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
3) రాజ్యాంగపు ఆధిపత్యం
4) అధికారాల పంపిణీ
- View Answer
- సమాధానం: 1
38. రాజ్యాంగ నిపుణుడైన కె.సి.వేర్ మాటల్లో, భారత్ ఒక?
1) సహకార సమాఖ్య
2) పాక్షిక సమాఖ్య
3) బలమైన ఏకకేంద్రం
4) సమాఖ్య కాదు
- View Answer
- సమాధానం: 2
39. ఏ సంవత్సరంలో విద్యాహక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది?
1) 2001
2) 2002
3) 2009
4) 2010
- View Answer
- సమాధానం: 4
40.పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు అధ్యక్షత వహించడానికి కారణం?
1) ప్రభుత్వం రూపొందించిన నియమాలు
2) సంప్రదాయం
3) పార్లమెంట్ పద్ధతి నియమాలు
4) రాష్ర్టపతి ఆదేశం
- View Answer
- సమాధానం: 2
41. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్‌సభ నుంచి, రాజ్యసభ నుంచి (అదే క్రమంలో) ఎంతమంది సభ్యులు ఉంటారు?
1) 15, 15
2) 15, 10
3) 20, 10
4) 10, 10
- View Answer
- సమాధానం: 3
42. ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ కింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది?
1) రాజ్యాంగంలోని నియమాలు
2) భారతీయ శిక్షాస్మృతిలోని నియమాలు
3) స్వచ్ఛందంగా పాటించేందుకు జారీ చేసినవి
4) ప్రజా ప్రతినిధ్య చట్టంలోని నియమాలు
- View Answer
- సమాధానం: 3
43.రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ ద్వారా రాష్ర్టపతి పాలన విధిస్తారు?
1) ఆర్టికల్ 356
2) ఆర్టికల్ 358
3) ఆర్టికల్ 360
4) ఆర్టికల్ 352
- View Answer
- సమాధానం: 1
44. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని?
1) సాధారణ మెజారిటీతో సవరించవచ్చు
2) సవరించడానికి వీల్లేదు
3) మూడింట రెండు వంతుల మెజారిటీతో సవరించవచ్చు
4) రాష్ట్రాల ఆమోదంతో సవరించవచ్చు
- View Answer
- సమాధానం: 2
45. కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి?
1) ఆర్టికల్ 19 కింద హక్కులు
2) ఆర్టికల్ 25 కింద హక్కులు
3) ఆర్టికల్ 21 కింద హక్కులు
4) ఆర్టికల్ 14 కింద హక్కులు
- View Answer
- సమాధానం: 1
46. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు, ఈ కమిటీ సిఫార్సుల వల్ల చేర్చినట్లు భావిస్తారు?
1) స్వరణ్ సింగ్ కమిటీ
2) నరసింహారావు కమిటీ
3) చవాన్ కమిటీ
4) బూటాసింగ్ కమిటీ
- View Answer
- సమాధానం: 1
47. అంతర్రాష్ర్ట మండలి నిర్ణయాలు కింది ఏ విధంగా తీసుకొంటారు?
1) సర్వ సమ్మతితో
2) హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీతో
3) హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో
4) హాజరైన సభ్యుల్లో నాలుగింట మూడు వంతుల మెజారిటీతో
- View Answer
- సమాధానం: 1
48. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగపు స్ఫూర్తితో చేర్చారు?
1) జర్మనీ
2) యూనియన్ ఆఫ్ సోవియట్సోషలిస్ట్ రిపబ్లిక్
3) ఐర్లాండ్
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
49. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు?
1) జస్టిస్ జె.ఎస్.ఖేహార్
2) జస్టిస్ ఎమ్.బి.లోకూర్
3) జస్టిస్ జె. చలమేశ్వర్
4) జస్టిస్ కురియన్ జోసెఫ్
- View Answer
- సమాధానం: 3
50.కేంద్ర-రాష్ర్ట సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎం.ఎం. పూంఛీ కమిషన్ సిఫార్సు ప్రకారం, రాష్ర్ట గవర్నర్ పదవీ కాలం?
1) స్థిరంగా 3 ఏళ్లు ఉండాలి
2) స్థిరంగా ఉండకూడదు
3) రాష్ర్ట విధాన సభ నిర్ణయించాలి
4) స్థిరంగా 5 ఏళ్లు ఉండాలి.
- View Answer
- సమాధానం: 4
51. కింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో లేదు?
1) అంతర్జాతీయ వాణిజ్య పెంపు
2) గోవధపై నిషేధం
3) స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం
4) న్యాయ, పరిపాలనా వ్యవస్థలను వేరు చేయడం
- View Answer
- సమాధానం: 1
52. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారం చేయాలని పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 38
2) ఆర్టికల్ 39
3) ఆర్టికల్ 40
4) ఆర్టికల్ 41
- View Answer
- సమాధానం: 3
53. ప్రజా బాహుళ్యం నుంచి అభిప్రాయ సేకరణకు అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు?
1) న్యాయ మంత్రిత్వ శాఖ
2) జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్
3) జాతీయ మానవ హక్కుల కమిషన్
4) జాతీయ న్యాయ కమిషన్
- View Answer
- సమాధానం: 4
54. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి కింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు?
1) ప్రధానమంత్రి
2) అధికార పార్టీ అధ్యక్షుడు
3) రాష్ర్టపతి
4) సభా నాయకుడు
- View Answer
- సమాధానం: 3
55. రాజ్యాంగం ప్రకారం, కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమష్టి జవాబుదారీగా ఉంటుంది?
1) పార్లమెంటు ఉభయ సభలకు
2) రాష్ర్టపతికి
3) అధికార పార్టీకి
4) లోక్‌సభకు
- View Answer
- సమాధానం: 4
56. సచిన్ టెండూల్కర్‌ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు?
1) సాహిత్యం
2) కళలు
3) విజ్ఞానం
4) సమాజ సేవ
- View Answer
- సమాధానం: 2
57. ఒక బిల్లు ద్రవ్యబిల్లు అవునా? కాదా? అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది?
1) రాష్ర్టపతి
2) లోక్‌సభ స్పీకర్
3) ఆర్థిక మంత్రి
4) అత్యున్నత న్యాయస్థానం
- View Answer
- సమాధానం: 2
58. కొలీజియమ్ పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ, దీని/వీరి నుంచి పొందడమైంది?
1) రాజ్యాంగం
2) ప్రభుత్వపు అంగీకారం
3) అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయాలు
4) భారత రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: 3
59. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసన సభ ఆమోదానికి పంపినప్పుడు, శాసనసభ తిరస్కరిస్తే తర్వాతి మార్గం ఏమిటి?
1) రెండు సభల ఉమ్మడి సమావేశం
2) శాసన మండలి తిరిగి శాసన సభ పునఃపరిశీలనకు పంపడం
3) బిల్లుని గవర్నర్ పరిశీలనకు పంపడం
4) బిల్ పరిసమాప్తి అవుతుంది
- View Answer
- సమాధానం: 4
60. ఒక రాష్ర్టంలో ముఖ్యమంత్రితో కలసి మంత్రుల సంఖ్య ఎంత కన్నా తక్కువ ఉండకూడదు?
1) 12
2) 10
3) 15
4) 7
- View Answer
- సమాధానం: 1
61. అడ్వొకేట్ జనరల్ వేతనం?
1) ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తి వేతనంతో సమానం
2) గవర్నర్ నిర్ణయిస్తారు
3) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానం
4) రాష్ర్ట కేబినెట్ మంత్రి వేతనంతో సమానం
- View Answer
- సమాధానం: 2
62. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం, కింది వారు గ్రామసభలో సభ్యులుగా ఉంటారు?
1) పంచాయతీ పరిధిలో 18 ఏళ్లు, ఆ పైబడిన వయసు ఉన్న వయోజనులు
2) ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు
3) పంచాయతీ పరిధిలో ఉన్న అందరు పౌరులు
4) గ్రామ పంచాయతీ అనుమతించిన అందరు వ్యక్తులు
- View Answer
- సమాధానం: 2
63. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్‌లో బేసిక్ (ప్రాథమిక) గ్రాంట్, పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి కింది విధంగా ఉంది?
1) 70:30
2) 80:20
3) 90:10
4) 75:25
- View Answer
- సమాధానం: 3
64. కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు?
1) ఆర్థిక కమిషన్
2) నీతి ఆయోగ్
3) అంతర్రాష్ర్ట మండలి
4) జాతీయ అభివృద్ధి మండలి
- View Answer
- సమాధానం: 1
65. వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత?
1) 5,000
2) 2,500
3) 1,250
4) 2,000
- View Answer
- సమాధానం: 2
66.కింది ఆర్టికల్స్‌ని, సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి?
A) ఆర్టికల్ 371A P) అస్సాం
B) ఆర్టికల్ 371B Q) నాగాలాండ్
C) ఆర్టికల్ 371C R) మణిపూర్
D) ఆర్టికల్ 371F S) మిజోరాం
E) ఆర్టికల్ 371G T) సిక్కిం
1) AP, BQ, CR, DS, ET
2) AP, BT, CQ, DS, ER
3) AQ, BP, CR, DT, ES
4) AR, BQ, CP, DT, ES
- View Answer
- సమాధానం: 3
67. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ర్టం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంత మంది సభ్యులుండొచ్చు?
1) 10 వరకు
2) 20 వరకు
3) 25 వరకు
4) 50 వరకు
- View Answer
- సమాధానం: 2
68. ఒక షెడ్యూల్డ్ ప్రాంతంలో శాంతి, సుపరిపాలన కోసం నిబంధనలు ఎవరు జారీ చేస్తారు?
1) రాష్ర్టపతి
2) పార్లమెంట్
3) విధానసభ
4) గవర్నర్
- View Answer
- సమాధానం: 4
69. ఒక షెడ్యూల్డ్ ప్రాంత సరిహద్దులను ఎవరు మార్చగలరు?
1) రాష్ర్టపతి
2) పార్లమెంట్
3) గవర్నర్
4) విధానసభ
- View Answer
- సమాధానం: 1
70. ఒక స్వయం ప్రతిపత్తిగల ప్రాంతం అంటే?
1) స్వయం ప్రతిపత్తిగల జిల్లాల సమాఖ్య
2) ఒక స్వయం ప్రతిపత్తి గత జిల్లాలోస్వయం ప్రతిపత్తి ఉన్న భాగం
3) 3 స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాల సమితి
4) ఒక స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా
- View Answer
- సమాధానం: 2
71. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ కింది హక్కు తాత్కాలికంగా రద్దు కాదు?
1) ఆర్టికల్ 21 కింద హక్కు
2) ఆర్టికల్ 19 కింద హక్కు
3) ఆర్టికల్ 14 కింద హక్కు
4) ఆర్టికల్ 22 కింద హక్కు
- View Answer
- సమాధానం: 1
72. 2015-2020 కాల వ్యవధిలో పంచాయతీ లకు ఇచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్ని 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది?
1) రూ.250,292.20 కోట్లు
2) రూ.300,292.20 కోట్లు
3) రూ.200,292.20 కోట్లు
4) రూ.275,292.20 కోట్లు
- View Answer
- సమాధానం: 3
73. నల్లమందు సాగు ఈ కింది జాబితాలో ఉంది?
1) కేంద్ర జాబితా
2) రాష్ర్ట జాబితా
3) ఉమ్మడి జాబితా
4) అవశేష అంశం
- View Answer
- సమాధానం: 1
74. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకి ఉన్న అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు?
1) అత్యున్నత న్యాయస్థానం
2) పౌర సమాజం
3) రాష్ట్రాలు
4) రాజ్యాంగం
- View Answer
- సమాధానం: 4
75. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది?
1) ఆర్టికల్ 350A
2) ఆర్టికల్ 300A
3) ఆర్టికల్ 351A
4) ఆర్టికల్ 301A
- View Answer
- సమాధానం: 1
76.న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయ స్థానం రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది?
1) ఆర్టికల్ 131
2) ఆర్టికల్ 132
3) ఆర్టికల్ 32
4) ఆర్టికల్ 134
- View Answer
- సమాధానం: 3
77. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం, కింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) రాజస్థాన్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
78. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లక్ష్యం?
1) గ్రామీణ విద్యుదీకరణను మెరుగుపర్చడం
2) ఆడిపిల్లలకు నైపుణ్యాలు అందించడం
3) స్త్రీలలో అక్షరాస్యతను మెరుగుపర్చడం
4) వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం
- View Answer
- సమాధానం: 4
79. తిరువనంతపురంలో 2016 డిసెంబర్ 28న జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
1) పినరయి విజయన్
2) రాజనాథ్ సింగ్
3) అరుణ్ జైట్లీ
4) కిరణ్ బేడీ
- View Answer
- సమాధానం: 2
80. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో గెలిచిన మొత్తం పతకాల సంఖ్య ఆధారంగా, దేశాలు అవరోహణ క్రమంలో?
1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, గ్రేట్ బ్రిటన్, చైనా, రష్యా
2) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా
3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా, గ్రేట్ బ్రిటన్, చైనా
4) రష్యా, గ్రేట్ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా
- View Answer
- సమాధానం: 2
81. ఏ విషయంలో అధ్యయనానికి 2016లో ఎకనామిక్స్ విభాగంలో ఓలివర్ హార్ట్‌కి నోబెల్ బహుమతి లభించింది?
1) విదేశీ వాణిజ్యపు సిద్ధాంతానికి
2) ఆర్థిక వృద్ధిపై విశ్లేషణకు
3) ద్రవ్యోల్బణంపై అధ్యయనానికి
4) ఒప్పంద సిద్ధాంతంపై పరిశోధనలకు
- View Answer
- సమాధానం: 4
82.2016లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నవారు/అందుకున్నది ఒక?
1) ప్రభుత్వేతర సంస్థ
2) మిషనరీ
3) దేశాధినేత
4) తిరుగుబాటు పార్టీ నాయకుడు
- View Answer
- సమాధానం: 3
83. 2016 సంవత్సరానికి వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం కింది విషయంపై పరిశోధనలకు దక్కింది?
1) మలేరియా చికిత్సకు
2) పరాన్న జీవుల వల్ల వచ్చే అంటువ్యాధులు
3) వైరస్ల వల్ల వచ్చే అంటువ్యాధులు
4) కణాల స్వయం శోషితకు కారణాలు
- View Answer
- సమాధానం: 4
84. ఫ్లయిట్ స్టాట్స్ సంస్థ ఇచ్చిన పురస్కారాల ప్రకారం, 2016లో, సకాలంలో విమానాలు నడిపిన సంస్థల్లో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ?
1) సింగపూర్ ఎయిర్ లైన్స్
2) క్వాంటాస్
3) కె.ఎల్.ఎం.
4) డెల్టా ఎయిర్ లైన్స్
- View Answer
- సమాధానం: 3
85. అల్లావుద్దీన్ ఖిల్జీ... ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు?
1) రైతులకు మెరుగైన ఫలసాయాన్ని అందించడానికి
2) వినియోగదారులు రైతుల వద్ద నుంచి నేరుగా కొనడానికి
3) విపణిలోని ధర న్యాయమైన ధరకి సమానంగా ఉండటానికి
4) సైనికులు తక్కువ జీతంతో సుఖంగా ఉండటానికి
- View Answer
- సమాధానం: 4
1) పశ్చిమ రోమన్ సామ్రాజ్య పతనం
3) దక్షిణ, తూర్పు ఆసియా పతనం
4) భారతీయ చేతివృత్తి పనివారి నిపుణత సన్నగిల్లడం
- View Answer
- సమాధానం: 1
87. కింది సుల్తానుల్లో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు?
1) ఫిరోజ్ తుగ్లక్
2) జలాలుద్దీన్ తుగ్లక్
3) మహమ్మద్ బిన్ తుగ్లక్
4) ఘియాసుద్దీన్ తుగ్లక్
- View Answer
- సమాధానం: 1
88.శతాబ్దాల పాటు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపియాను ఎవరు ప్రవేశపెట్టారు?
1) అక్బర్
2) షేర్షా సూరి
3) జహంగీర్
4) హుమాయూన్
- View Answer
- సమాధానం: 2
89. రాజా తోడర్మల్ రూపొందించిన ‘దహ్ సాలా’ పద్ధతి కింది విధంగా ఉండేది?
1) పదేళ్లు చెల్లుబడి అయ్యే ఒక ప్రామాణిక రీతిలో భూమిశిస్తు వసూలు చేయడం
2) భూమి శిస్తు లెక్క కోసం పదేళ్లకు ఒకసారి భూమిని కొలిచేవారు
3) ఉత్పత్తి, ధరల పదేళ్ల సగటు ఆధారంగా భూమిశిస్తు వసూలు చేయడం
4) పదేళ్లు రైతు, రాజ్యం మధ్య పంట పంచుకోవడం.
- View Answer
- సమాధానం: 3
90. మొగల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులను చాలా ఎక్కువ దూరం తీసుకెళ్లి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు?
1) బేపారులు
2) బనికులు
3) షరాఫ్‌లు
4) బంజారాలు
- View Answer
- సమాధానం: 4
91.మొగల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌కు వెళ్లేది?
1) 10 శాతం
2) 15 శాతం
3) 20 శాతం
4) 25 శాతం
- View Answer
- సమాధానం: 3
92. 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ ‘‘భారత్ వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి’’ అని ఎవరు అన్నారు?
1) పీటర్, ద గ్రేట్ ఆఫ్ రష్యా
2) వాస్కో డ గామా
3) రాబర్ట్ క్లైవ్
4) ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే
- View Answer
- సమాధానం: 1
93. అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలను ఎత్తేసిన బెంగాల్ నవాబు ఎవరు?
1) మీర్ జాఫర్
2) సిరాజ్-ఉద్-దౌలా
3) మీర్ ఖాసీం
4) నిజాం-ఉద్-దౌలా
- View Answer
- సమాధానం: 3
94. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వల్ల?
1) భారతదేశం నుంచి ముడి పత్తి ఎగుమతి పెరిగింది
2) భారతదేశం నుంచి వస్త్రాల ఎగుమతి పెరిగింది
3) భారత్ వస్త్ర వ్యాపారంలో సరళీకరణ జరిగింది
4) భారత్ వస్త్ర వ్యాపారంలో ఏ మార్పులేదు
- View Answer
- సమాధానం: 1
95. 1750లో, ప్రపంచంలో తయారయ్యే వస్తువుల్లో సుమారు ఎంత శాతం భారత్‌లో తయారయ్యేవి?
1) 24.5%
2) 14.5%
3) 11.5%
4) 9.5%
- View Answer
- సమాధానం: 1
96. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది?
1) 5వ
2) 4వ
3) 2వ
4) 6వ
- View Answer
- సమాధానం: 3
97. డబ్బు (కరెన్సీ) నోట్లను చెల్లుబాటు నుంచి తీసివేయడం అనే విషయం ఏ చట్టం పరిధిలో ఉంటుంది?
1) మనీ లాండరింగ్ నిరోధక చట్టం
2) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం
3) బ్యాంకింగ్ నియంత్రణ చట్టం
4) భారతీయ కాగితపు (పేపర్) కరెన్సీ ఆదేశం
- View Answer
- సమాధానం: 2
98.కింది వారిలో ఎవరికి భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధంలేదు?
1) సి.సుబ్రమణియం
2) డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్
3) సర్దార్ స్వరణ్ సింగ్
4) నార్మన్ బోర్లాగ్
- View Answer
- సమాధానం: 3
99. లోక్‌సభలో భారత ప్రభుత్వ బడ్జెట్‌ను సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11:00కు మార్చారు?
1) 1999
2) 2000
3) 2010
4) 2001
- View Answer
- సమాధానం: 1 (Final Key)
100. భారత ప్రభుత్వ కోశపరమైన లోటు కింది దానికి దగ్గరగా ఉంటుంది?
1) రెవెన్యూ జమల కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో, అంత
2) ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకొన్న అప్పులు
3) పన్నుల నుంచి వచ్చే ఆదాయం కన్నా రెవెన్యూ, కాపిటల్ ఖర్చు ఎంత అధికమో, అంత
4) ఆర్థిక సంవత్సరపు అంతానికి పేర్కొన్న ప్రభుత్వ (పబ్లిక్) అప్పులు
- View Answer
- సమాధానం: 2
101.14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత?
1) 42%
2) 36%
3) 32.5%
4) 29.5%
- View Answer
- సమాధానం: 1
102. హరిత విప్లవం ప్రాథమిక ఉద్దేశం?
1) భూమి పునర్ పంపిణీ ద్వారా ఎక్కువ ఉత్పత్తి సాధించడం
2) ప్రణాళికాబద్ధ ఆహార ధాన్యాల ఎగుమతి
3) వాణిజ్య పంటల సాగు
4) అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి
- View Answer
- సమాధానం: 4
103. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణల్లో, కింది విధాన చర్యను చేపట్టలేదు?
1) నోట్ల విలువ తగ్గింపు
2) బంగారాన్ని రిజర్వ బ్యాంక్ ఖజానా నుంచి విదేశాలకు తరలించడం
3) నోట్ల రద్దు
4) రూపాయి పాక్షిక పరివర్తనీయత
- View Answer
- సమాధానం: 3
104. సరళీకరణ, ప్రైవేటీకరణ, విశ్వీకరణలో కింది విధాన చర్య భాగం కాదు?
1) రక్షణ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు
2) కేపిటల్ ఖాతాలో పరివర్తనీయత
3) రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టబడులు
4) పెట్టుబడుల ఉపసంహరణ
- View Answer
- సమాధానం: 2
105. హరిత విప్లవం వల్ల కింది ఏ పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనిపించింది?
1) వరి
2) గోధుమ
3) పప్పుధాన్యాలు
4) చిరుధాన్యాలు
- View Answer
- సమాధానం: 2
106. ఖరీఫ్ 2016-17 కాలానికి, భారత ప్రభుత్వం సాధారణ వరికి క్వింటాల్‌కి ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంత?
1) రూ.1,470
2) రూ.1,510
3) రూ.1,625
4) రూ.1,650
- View Answer
- సమాధానం: 1
107. జాతీయ వ్యవసాయ విధానం-2000 ప్రకారం, వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యం కింది దాని కన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించారు?
1) 2%
2) 2.5%
3) 3%
4) 4%
- View Answer
- సమాధానం: 4
108. ‘గరీబీ హటావో’ను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు?
1) 4
2) 5
3) 6
4) 3
- View Answer
- సమాధానం: 2
109. కోశ బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం కింది దాన్ని చేయదు?
1) కోశ, రెవెన్యూ లోటుకు పరిమితి విధించడం
2) బడ్జెట్‌తో పాటు కొన్ని దృష్టికోణ స్టేట్మెంట్స్ సభ ముందు పెట్టాలని నిబంధన విధించడం
3) లోటులో లక్ష్యాలను సాధించడంలో విఫలం అయితే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండటం
4) కేంద్ర, రాష్ట్రస్థాయిలో వర్తించడం
- View Answer
- సమాధానం: 3
110. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం?
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం
2) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం
3) పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం
4) పూర్తిగా బయటి నిధులతో నడిచే పథకం
- View Answer
- సమాధానం: 1
111. పారిశ్రామిక విధాన తీర్మానం 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది?
1) భారీ పరిశ్రమలు
2) చిన్నతరహా, గ్రామీణ పరిశ్రమలు
3) ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు
4) ఖనిజ రంగం
- View Answer
- సమాధానం: 2
112. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (PMRY)ని అమలు చేసే సంస్థ?
1) జాతీయీకరణ చేసిన బ్యాంకులు
2) చిన్నతరహా పరిశ్రమల సేవా సంస్థ
3) జిల్లా పరిశ్రమల కేంద్రం
4) జిల్లా ఉపాధి కల్పనా కేంద్రం
- View Answer
- సమాధానం: 3
113. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఏ రంగంలో పూర్తిగా నిషేధించారు?
1) పెట్రోలియం శుద్ధి (రిఫైనింగ్) రంగం
2) కేబుల్ నెట్వర్కలు
3) వార్తా పత్రికలు
4) చిట్ఫండ్లు
- View Answer
- సమాధానం: 4
114. ప్రస్తుత విధానం ప్రకారం, బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో, పెట్టబడి వాటాల్లో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నారు?
1) 51%
2) 49%
3) 26%
4) 100%
- View Answer
- సమాధానం: 1
115.నవంబర్ 2016 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు కాలేదు?
1) తిరుపతి లడ్డు
2) ఉప్పాడ జాందానీ చీర
3) గుంటూరు సన్నం మిరపకాయ
4) బందరు లడ్డు
- View Answer
- సమాధానం: 4
116. జాతీయ తయారీ విధానం, 2011 దృష్టి ప్రకారం, 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి?
1) 200 మిలియన్లు
2) 100 మిలియన్లు
3) 75 మిలియన్లు
4) 50 మిలియన్లు
- View Answer
- సమాధానం: 2
117. MGNREGA (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎప్లాయ్మెంట్ గ్యారంటీ) పథకం ఆదేశం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు (పని చేయడానికి ముందుకు వచ్చే వారికి) పని ఇవ్వాలని గ్యారంటీ ఉంది?
1) గ్రామంలో ప్రతి వయోజనుడికి 100 దినాలు
2) గ్రామంలో ప్రతి వయోజనుడికి 150 దినాలు
3) గ్రామంలోని ప్రతి ఇంటికి (ఇంట్లోని వయోజనులు మందుకొస్తే) 100 దినాలు
4) గ్రామంలోని ప్రతి ఇంటికి (ఇంట్లోని వయోజనులు మందుకొస్తే) 150 దినాలు
- View Answer
- సమాధానం: 3
118. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద, ప్రమాదాల నుంచి బీమా భద్రతకు పాలసీదారు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి?
1) సర్వీస్ పన్ను కాకుండా రూ.12
2) సర్వీస్ పన్నుతో కలిపి రూ.12
3) సర్వీస్ పన్ను కాకుండా రూ.330
4) సర్వీస్ పన్నుతో కలిపి రూ.330
- View Answer
- సమాధానం: 1 (Final Key revised)
119. ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ధర్మకర్తల మండలి, ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది?
1) 8.8%
2) 8.75%
3) 8.7%
4) 8.65%
- View Answer
- సమాధానం: 4
120. మాతృత్వ లబ్ధి (సవరణ) బిల్లు-2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కల మాతృమూర్తులకు ప్రసూతి సెలవు 12 వారాల నుంచి కింది కాలానికి పెంచాలని ప్రతిపాదించారు?
1) 18 వారాలు
2) 22 వారాలు
3) 26 వారాలు
4) 30 వారాలు
- View Answer
- సమాధానం: 3
121.ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందడానికి, ఒక ఉద్యోగి మాసిక వేతనం గరిష్ట పరిమితి ఎంత?
1) రూ.15,000
2) రూ.21,000
3) రూ.25,000
4) రూ.27,000
- View Answer
- సమాధానం: 2
122.కార్మిక బ్యూరో 28వ ఖఉ (ఉపాధిలో త్రైమాసిక మార్పులు) రిపోర్ట్ ప్రకారం, 2015లో అత్యధిక ఉపాధి కల్పించిన రంగం?
1) IT/BPO రంగం (సమాచార సాంకేతికత/వ్యాపార ప్రక్రియల్లో పొరుగు సేవల రంగం
2) వస్త్ర, దుస్తుల రంగం
3) లోహ రంగం
4) ఆటో మొబైల్ రంగం
- View Answer
- సమాధానం: 1
123. జనగణన-2011 ప్రకారం షెడ్యూల్డ్ తెగల వారి గృహాల్లో ఎంతశాతం (దగ్గరి పూర్ణ సంఖ్యకు కుదించారు) కాల్చిన ఇటుకలు లేదా కాంక్రీట్‌తో నిర్మించిన గోడలు కలిగి ఉన్నాయి?
1) 22 శాతం
2) 23 శాతం
3) 24 శాతం
4) 25 శాతం
- View Answer
- సమాధానం: 2
124. CAPART (కపార్ట్)ని ఏ ఉద్దేశంతో స్థాపించారు?
1) సూపర్ కంప్యూటర్లు తయారు చేయడానికి
2) ఎగుమతులను ప్రోత్సహించడానికి
3) గ్రామీణాభివృద్ధికి
4) కాలుష్య నివారణకు
- View Answer
- సమాధానం: 3
125.వ్యవసాయ గణన 2010-11 ప్రకారం, 2010-11లో అన్ని వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చేతిలో ఉన్న, వినియోగంతో ఉన్న భూకమతాల సగటు విస్తీర్ణం హెక్టార్లలో వరుస క్రమంలో ఎంత?
1) 1.15; 0.80; 1.52
2) 1.52; 0.15; 0.80
3) 1.52; 0.80; 1.15
4) 1.15; 1.52; 0.80
- View Answer
- సమాధానం: 1
126. వ్యవసాయ గణన 2010-11 ప్రకారం భారతదేశంలో చిన్న, మధ్య రకం భూకమతాలు మొత్తం భూకమతాల సంఖ్యలో 85% ఉన్నాయి. అయితే ఈ కమతాల చేతిలో ఉన్న వినియోగంలోని విస్తీర్ణం మొత్తం వినియోగంలో ఉన్న విస్తీర్ణంలో ఎంత శాతం?
1) 54.58%
2) 44.58%
3) 34.58%
4) 24.58%
- View Answer
- సమాధానం: ప్రశ్న తప్పుగా ఇచ్చారు కాబట్టి తొలగించారు.
1) ఆదాయం
2) వినియోగం
3) ఆస్తి
4) సామాజిక హోదా
- View Answer
- సమాధానం: 2
128. 2016లో నిర్వహించిన గణతంత్ర దివస్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు?
1) బరాక్ ఒబామా
2) డేవిడ్ కామరూన్
3) ఫ్రాంకోయిస్ హోలండే
4) షింజో అబే
- View Answer
- సమాధానం: 3
129. 2014-15 సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు?
1) 7.3%
2) 7.8.%
3) 7%
4) 7.5%
- View Answer
- సమాధానం: 7.2% (సరైన సమాధానం లేదు కాబట్టి ప్రశ్న తొలగించబడింది.)
130.ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అనే ప్రదేశం ఏ దేశంలో ఉంది?
1) ఇజ్రాయెల్
2) సిరియా
3) ఉక్రైన్
4) పాలస్తీనా
- View Answer
- సమాధానం: 2
131. భారతదేశం తర్వాత పెద్దనోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దేశం?
1) కొలంబియా
2) వెనిజులా
3) బ్రెజిల్
4) చిలీ
- View Answer
- సమాధానం: 2
132. సూపర్ వ్యూ-1 అనే జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఏదేశం ప్రయోగించింది?
1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2) రష్యా
3) ఫ్రాన్స్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
133.డిసెంబర్ 2016లో నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ముఖ్య అంశం (థీమ్) ఏమిటి?
1) నా స్వరం లెక్కింపదగ్గది
2) మన హక్కులు, మన స్వేచ్ఛలు, ఎల్లప్పడూ
3) ఈ రోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాం
4) # హక్కులు 365
- Answer
- సమాధానం: 3
134. హార్నబిల్ పండుగ ఏ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్వహిస్తారు?
1) నాగాలాండ్
2) మిజోరాం
3) మణిపూర్
4) మేఘాలయ
- View Answer
-
సమాధానం: 1
-
135. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే 11న నిర్వహించడానికి కారణం, ఆ రోజున?
1) పరమ్ సూపర్ కంప్యూటర్ని ప్రారంభించారు
2) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తన మొదటి PSLV రాకెట్‌ను ప్రయోగించింది
3) మొదటి అణు రియాక్టర్ పని ప్రారంభించింది
4) పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు
- View Answer
-
సమాధానం: 4
-
136. ‘సంతారా’ అనే ఆమరణ ఉపవాస దీక్ష ఏ మతంవారి ఆచారం?
1) బౌద్ధులు
2) జైనులు
3) సూఫీ
4) పార్శీ
- View Answer
-
సమాధానం: 2
-
137. ప్రపంచ చదరంగ విజేత అయిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందిన వాడు?
1) స్వీడన్
2) కెనడా
3) నార్వే
4) గ్రేట్ బ్రిటన్
- View Answer
-
సమాధానం: 3
-
138.FICN అంటే?
1) ఫారిన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ నోట్
2) ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్స్ నోటీస్డ్
3) ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్
4) ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ నేషన్స్
- View Answer
-
సమాధానం: 3
-
139. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఎంత శాతం?
1) 4.305%
2) 3.083%
3) 2.503%
4) 5.521%
- View Answer
-
సమాధానం: 1
-
140. డిసెంబర్ 2015లో పారిస్‌లో వాతావరణ మార్పుపై నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఏ విషయంలో అంగీకారం వచ్చింది?
1) కేంద్రీకృతంగా నిర్ణయించిన వాటాలు
2) సామర్థ్యం ఆధారంగా నిర్ణయించిన వాటాలు
3) ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్ణయించిన వాటాలు
4) దేశంలో నిర్ణయించిన వాటాలు
- View Answer
-
సమాధానం: 4
-
141. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే ప్రాజెక్ట్‌ను నడిపే పరిశోధనా సంస్థల సమూహాన్ని కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలుస్తారు?
1) IndIGO
2) ILIGO
3) IndLIGO
4) InIGO
- View Answer
-
సమాధానం: 1
-
142. జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరానికి దగ్గరగా ఉంది?
1) తిరువనంతపురం
2) చండీగఢ్
3) తిరుపతి
4) బెంగళూరు
- View Answer
-
సమాధానం: 3
-
143. ‘సెకండ్ హాండ్ టైమ్’ అనే నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకం విషయం?
1) విజ్ఞాన శాస్త్రంలో సమయ భావన
2) సోవియట్ యూనియన్ సమాజం, రాజకీయాలు
3) సమయ నిర్వహణ
4) వివిధ కాలాల చరిత్ర
- View Answer
-
సమాధానం: 2
-
144. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై
2) తిరుపతి
3) మైసూర్
4) కోల్‌కతా
- View Answer
-
సమాధానం: 2
-
145. కింది గణాంకాన్ని మానవ అభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకోరు?
1) తలసరి ఆదాయం
2) పాఠశాలకు వెళ్లిన సంవత్సరాలు
3) ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు
4) జీవన కాల ఆశంస స్థాయి
- View Answer
-
సమాధానం: 3
-
146.టి.ఎం.కృష్ణకు మెగసెసే పురస్కారం 2016లో కింది ఏ కార్యక్రమానికి ఇచ్చారు?
1) సంగీతంలో ప్రతిభకు
2) ప్రజాసేవకు
3) ప్రపంచ శాంతి కోసం కృషికి
4) సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి
- View Answer
-
సమాధానం: 4
-
147. కింది వారిలో ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ స్థాపకుల్లో ఒకరైన వారు ఎవరు?
1) కైలాష్ సత్యార్థి
2) బెజవాడ విల్సన్
3) బిందేశ్వర్ పాఠక్
4) కమలాబెన్ గుర్జర్
- View Answer
-
సమాధానం: 2
-
148. దిల్మా రౌసెఫ్ వార్తల్లో ఉండటానికి కారణం?
1) ఆమె రెండో సారి బ్రెజిల్ దేశాధ్యక్షురాలిగా ఎన్నికవడం
2) ఆమెకు అంతర్జాతీయ శాంతి పురస్కారం లభించడం
3) సెనేట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుంచి తొలగించడం
4) తిరుగుబాటు చర్య ద్వారా ఆమెను పదవీచ్యుతురాలిని చేయడం
- View Answer
-
సమాధానం: 3
-
149. ‘బ్రెగ్జిట్’ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్‌లో కిందిది జరగలేదు?
1) ప్రధాన మంత్రి మారారు
2) ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది
3) కొత్త ప్రధాని ఒక మహిళ
4) హోం సెక్రటరీ కన్జర్వేటివ్ నాయకత్వం చేపట్టారు.
- View Answer
-
సమాధానం: 2
-
150. 2015, జూన్‌లో గ్రీస్ దేశంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, కింది ఏ విషయాన్ని నిర్ణయించడానికి జరిగింది?
1) కరెన్సీ విలువను తగ్గించాలా? వొద్దా?
2) పార్లమెంట్ అధికారాలు తగ్గించాలా? వొద్దా?
3) యూరోపియన్ యూనియన్ నుంచి వెళ్లాలా? వొద్దా?
4) ఉద్దీపన కోసం యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా? వొద్దా?
- View Answer
- సమాధానం: 4