జనవరి 1 నుంచి దూరవిద్య తరగతులు
Sakshi Education
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న పలు కోర్సులకు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి కాంట్రాక్టు తరగతులు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎం.ఎ.తెలుగు, సంస్కృతం, జ్యోతిషం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, టూరిజం మేనేజ్‌మెంట్, ఎంసీజే రెండో సంవత్సరం విద్యార్థులకు, బీఏ స్పెషల్ తెలుగు రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు, బీఏ కర్ణాటక సంగీతం రెండు, మూడు, నాల్గో సంవత్సరం విద్యార్థులకు 2015 జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు; లలిత సంగీతం రెండో సంవత్సరం, సంగీత విశారద రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో సంవత్సరం విద్యార్థులకు 2015 జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు కాంట్రాక్టు తరగతులు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను తెలుగు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Published date : 31 Dec 2014 12:31PM