Skip to main content

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు నెలాఖరులోగా పాఠ్యపుస్తకాలు

సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడింది.
అడ్మిషన్లు పొందిన రెండు నెలల తర్వాత వారికి పాఠ్య పుస్తకాలు అందజేసే ప్రక్రియ మొదలైంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన వారికే కాకుండా ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు త్వరలో పుస్తకాలు అందనున్నాయి. తెలంగాణ జిల్లాలోని కేంద్రాలకు ఈనెల 20లోగా, ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రాలకు ఈ నెలాఖరులోగా చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
Published date : 08 Jan 2016 02:08PM

Photo Stories