Skip to main content

Breaking News.. APPSC Jobs Notification : గుడ్‌న్యూస్‌.. ఏపీపీఎస్సీ 240 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవ‌లే గ్రూప్ 1, 2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ డిసెంబ‌ర్ 30వ తేదీ (శ‌నివారం)నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Lecturer Posts Notification   Lecturer Vacancies by APPSC  APPSC Group 1 and 2 Notification   APPSC Notification for Lecturer Recruitment  APPSC 240 DL Jobs Notification 2023  APPSC Group 1 and 2 Notification

మొత్తం 240 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. ఇటీవ‌లే  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 99 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

☛ APPSC Group 2 Jobs Notification 2023 Released : Good News.. 899 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. సిల‌బ‌స్‌, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఇలా..
 
ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

appsc jobs 2024

అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన  అర్హత, వయసు, జీతం తదితర పూర్తి వివరాలను జనవరి 24 లోపు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

APPSC 240 DL పోస్టులకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..
 

Published date : 03 Jan 2024 03:24PM
PDF

Photo Stories