World TT 2022 : రెండో సీడ్ జర్మనీపై భారత్ విజయం
గ్రూప్–2లో భాగంగా అక్టోబర్ 2న జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో రెండో సీడ్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ జట్టును ఓడించింది. ప్రపంచ 37వ ర్యాంకర్ సత్యన్ జ్ఞానశేఖరన్ గొప్ప ప్రదర్శనతో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో సత్యన్ 11–13, 4–11, 11–8, 11–4, 11–9తో 36వ ర్యాంకర్ డూడా బెనెడిక్ట్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో హర్మత్ దేశాయ్ 7–11, 9–11, 13–11, 3–11తో డాంగ్ కియు చేతిలో ఓడిపోయాడు. మూడో మ్యాచ్‌లో 142వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ 13–11, 6–11, 11–8, 12–10తో 74వ ర్యాంకర్ రికార్డో వాల్తెర్‌పై గెలవడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో సత్యన్ 10–12, 7–11, 11–8, 11–8, 11–9తో ప్రపంచ 9వ ర్యాంకర్ డాంగ్ కియును ఓడించడంతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్–5 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–0తో గెలిచి తొలి విజయం నమోదు చేసింది.
Also read: Weekly Current Affairs (National) Bitbank: 300 మీటర్ల పొడవైన అటల్ వంతెన ఏ నగరంలో ప్రారంభించబడింది?