Skip to main content

Wimbledon Players: రష్యా, బెలారస్‌ టెన్నిస్‌ ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేసిన ‘వింబుల్డన్‌’ నిర్వాహకులు

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్‌ టెన్నిస్‌ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిషేధం విధించింది.
Daniil Medvedev plays for Russia

దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్‌ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్‌ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్‌ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్‌ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత అరీనా సబలెంకా (బెలారస్‌) వింబుల్డన్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. 

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

Published date : 01 Apr 2023 05:53PM

Photo Stories