Weightlifting: జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణి?
Sakshi Education
IWF Junior World Weightlifting Championship 2022: భారత వెయిట్ లిఫ్టర్ హర్షద శరద్ గరుడ్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. గ్రీస్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 45 కిలోల విభాగంలో హర్షద స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 70 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కిలోలతో మొత్తం 153 కిలోల బరువులెత్తి జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. జూనియర్ ప్రపంచ టోర్నీలో భారత్ తరఫున పతకాలు సాధించిన వారిలో మీరాబాయి చాను(కాంస్యం–2013), ఆచింత షూలి(రజతం–2021) ఉన్నారు.
Weightlifting: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన క్రీడాకారిణి?
Published date : 10 May 2022 06:50PM