Skip to main content

National TTలో శ్రీజకు రెండు పతకాలు

జాతీయ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్‌ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో సెప్టెంబర్ 24న టీటీ ఈవెంట్‌ ముగిసింది.
Two medals for Sreeja in National TT
Two medals for Sreeja in National TT

ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్‌ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్‌ ఉత్పల్‌ షా–కృత్విక్ సిన్హా రాయ్‌ (గుజరాత్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్‌) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు.   

Also read: Quiz of The Day (September 26, 2022): ‘బ్యూటీ విటమిన్’ అని ఏ విటమిన్‌కు పేరు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Sep 2022 07:15PM

Photo Stories