Tejaswin Shankar: హైజంప్‌లో తేజస్విన్‌కు స్వర్ణం
Sakshi Education
న్యూ బ్యాలెన్స్ ఇండోర్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మీట్‌లో భారత్‌కు చెందిన తేజస్విన్ శంకర్ హైజంప్‌లో స్వర్ణ పతకం సాధించాడు.
24 ఏళ్ల తేజస్విన్ 2.26 మీటర్ల దూరం ఎగిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2007 ప్రపంచ చాంపియన్, 2010 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత డొనాల్డ్ థామస్ (బహామస్) 2.23 మీటర్లతో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అమెరికాలోని కన్సాస్ స్టేట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఆడిన తొలి టోర్నీలో తేజస్విన్ స్వర్ణం సాధించడం విశేషం. గత ఏడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో తేజస్విన్ కాంస్య పతకాన్ని సాధించాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (15-21 జనవరి 2023)
Published date : 06 Feb 2023 05:41PM