Skip to main content

Tennis: ఐటీఎఫ్‌ న్యూఢిల్లీ ఓపెన్‌ టోర్నీలో టైటిల్‌ సొంతం చేసుకున్న జంట?

Saketh Myneni-Vishnu Vardhan

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) న్యూఢిల్లీ ఓపెన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌తో కలిసి భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 21న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాకేత్‌–విష్ణువర్ధన్‌ ద్వయం 6–3, 3–6, 13–11తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌)–సోంబోర్‌ వెల్జ్‌ (హంగేరి) జోడీపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2021 ఏడాది సాకేత్‌ గెలిచిన మూడో డబుల్స్‌ టైటిల్‌ ఇది. గత మార్చిలో లక్నో ఓపెన్‌లో యూకీ బాంబ్రీతో కలిసి... ఏప్రిల్‌లో అర్జున్‌ ఖడేతో కలిసి న్యూఢిల్లీ ఓపెన్‌లో సాకేత్‌ డబుల్స్‌ విభాగంలో టైటిల్స్‌ గెలిచాడు. ఓవరాల్‌గా సాకేత్‌ కెరీర్‌లో ఇది 23వ డబుల్స్‌ టైటిల్‌.

అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఏ క్రీడలో ప్రసిద్ది చెందాడు?

పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) విజేతగా నిలిచాడు. ఇటలీలో నవంబర్ 21న జరిగిన ఫైనల్లో మూడో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ 6–4, 6–4తో రెండో ర్యాంకర్, గత ఏడాది విజేత మెద్వెదేవ్‌ (రష్యా)పై గెలిచాడు. చాంపియన్‌గా నిలిచిన జ్వెరెవ్‌కు 21,43,000 డాలర్ల (రూ. 15 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
 

చ‌ద‌వండి: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీ టైటిల్‌ సొంతం చేసుకున్న జట్టు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) న్యూఢిల్లీ ఓపెన్‌ టోర్నీ-2021లో విజేతగా నిలిచిన జంట?
ఎప్పుడు : నవంబర్‌ 21
ఎవరు   : సాకేత్‌ మైనేని-విష్ణువర్ధన్‌ ద్వయం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫైనల్లో సాకేత్‌–విష్ణువర్ధన్‌ ద్వయం.. జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌)–సోంబోర్‌ వెల్జ్‌ (హంగేరి) జోడీపై విజయం సాధించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Nov 2021 04:29PM

Photo Stories