Formula One: సౌదీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో తొలిసారి నిర్వహించిన సౌదీ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. సౌదీ అరేబియాలోని జెద్దాలో డిసెంబర్ 7న ముగిసిన 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా 2 గంటలా 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించి విజేతగా అవతరించాడు. 21.825 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని వాల్తేరి బొటాస్ (మెర్సిడెస్) పొందాడు.
శ్రీకృష్ణ సాయికుమార్ ఏ క్రీడకు చెందినవాడు?
బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారులు శ్రీకృష్ణ సాయికుమార్ పొదిలె–బొక్కా నవనీత్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. డిసెంబర్ 7న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్–నవనీత్ ద్వయం 15–21, 9–21తో టాప్ సీడ్ సచిన్ డయాస్–బువనెక గుణతిలక (శ్రీలంక) జోడీ చేతిలో ఓడిపోయింది.
చదవండి: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021 విజేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సౌదీ గ్రాండ్‌ప్రి–2021లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : జెద్దా, సౌదీ అరేబియా
ఎందుకు : 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా 2 గంటలా 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్