Skip to main content

Kuala Lumpur: ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌-2021 విజేత?

Malasia Flag
మలేసియా జెండా

ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌–2021లో భారత పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. డిసెంబర్‌ 4న మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ 1–2తో మలేసియా చేతిలో ఓడి రన్నరప్‌ టైటిల్‌తో సరిపెట్టుకుంది. గతంలో భారత్‌ 1981, 2012లలో కూడా ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

మహేశ్‌ మంగావ్‌కర్‌ ఏ క్రీడకు చెందిన వాడు?

  • ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌–2021లో ఫైనల్లో.. తొలి మ్యాచ్‌లో సౌరవ్‌ ఘోషాల్‌ 10–12, 4–11, 8–11తో ఎన్గ్‌ ఎయిన్‌ యౌ (మలేసియా) చేతిలో ఓడాడు. 
  • రెండో మ్యాచ్‌లో రమిత్‌ టాండన్‌ 8–11, 11–8, 3–11, 1–11తో ఇవాన్‌ యెయున్‌ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూడటంతో భారత టైటిల్‌ ఆశలు ఆవిరయ్యాయి. 
  • నామమాత్రంగా జరిగిన మూడో మ్యాచ్‌లో మహేశ్‌ మంగావ్‌కర్‌ 11–9, 11–7, 11–8తో కమాల్‌ (మలేసియా)పై గెలిచాడు.

చ‌ద‌వండి: అథ్లెటిక్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైన మాజీ క్రీడాకారిణి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌–2021 విజేత?
ఎప్పుడు : డిసెంబర్‌ 4
ఎవరు    : మలేసియా పురుషుల జట్టు
ఎక్కడ    : కౌలాలంపూర్, మలేసియా
ఎందుకు : ఫైనల్లో భారత్‌ 1–2తో మలేసియా చేతిలో ఓడినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Dec 2021 03:27PM

Photo Stories