భారత్ క్లీన్‌స్వీప్...సిరీస్ 3–0తో కైవసం..‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ శర్మ బృందం 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ కెపె్టన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు. చివర్లో దీపక్ చహర్ (8 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతీరుతో భారత్ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గప్టిల్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (3/9), హర్షల్ పటేల్ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్ కెపె్టన్సీ బాధ్యతలు నిర్వహించాడు. రెండు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 25న కాన్పూర్‌లో మొదలవుతుంది.
రోహిత్ దూకుడు...
భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఖాతా తెరిచిన రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్నే వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కూడా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా... ఇషాన్ మరో ఫోర్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో భారత్‌కు 20 పరుగులు లభించాయి. పవర్‌ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిశాక టీమిండియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. సాన్‌ట్నర్ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ (0)లతో పాటు తన తర్వాతి ఓవర్‌లో పంత్ (4)ను అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్‌లో రోహిత్ దూకుడు తగ్గించలేదు. అతడు 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సోధి పట్టిన అద్భుత రిటర్న్ క్యాచ్‌తో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దాంతో భారత్ 69/0 నుంచి 103/4గా నిలిచింది. చివర్లో హర్షల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ దూకుడుగా ఆడారు. మిల్నే వేసిన ఆఖరి ఓవర్లో దీపక్ వరుసగా 4, 4, 2, 6, 2, 1తో 19 పరుగులు రాబట్టాడు.
గప్టిల్ ఒక్కడే...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ మిచెల్ (5) త్వరగా అవుటయ్యాడు. చాప్‌మన్ (0), ఫిలిప్స్ (0)లను అక్షర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్ గప్టిల్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చహల్ బౌలింగ్‌లో గప్టిల్ భారీ షాట్‌కు యతి్నంచి లాంగాన్‌లో సూర్యకుమార్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ విఫలమవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైంది.
- న్యూజిలాండ్‌పై భారత్‌కిది మూడో టి20 సిరీస్ విజయం. రెండు జట్ల మధ్య ఆరు టి20 సిరీస్‌లు జరిగాయి. మరో మూడింటిలో న్యూజిలాండ్ గెలిచింది.
- స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన టి20 మ్యాచ్‌ల సంఖ్య 11.