ICC: సీఈఓగా జెఫ్ అలార్‌డైస్ నియామకం
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్ అలార్‌డైస్‌ను నియమించారు.
54 ఏళ్ల అలార్‌డైస్ గత ఎనిమిది నెలలుగా ఐసీసీ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన అలార్‌డైస్ గతంలో ఎనిమిదేళ్లపాటు ఐసీసీ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 1990 దశకంలో ఆయన ఆ్రస్టేలియాలోని విక్టోరియా జట్టు తరఫున 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.
Published date : 22 Nov 2021 06:08PM