Skip to main content

BWF Rankings: ఎనిమిదో ర్యాంక్‌కు ప్రణయ్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

కొంత కాలంగా చక్కటి ఫామ్‌లో ఉన్న ప్రణయ్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ఆడటంతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు కూడా నామినేట్‌ అయ్యాడు. ఇతర భారత షట్లర్లలో లక్ష్యసేన్‌ తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా, కిడాంబి శ్రీకాంత్‌ 12వ స్థానానికి దిగజారాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన పీవీ సింధు కూడా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి పడిపోయింది.

BWF Rankings: తొలిసారి టాప్‌–20లోకి గాయత్రి జోడీ

Published date : 28 Dec 2022 05:36PM

Photo Stories