Skip to main content

Cristiano Ronaldo: సౌదీ అరేబియా క్లబ్‌తో రొనాల్డో ఒప్పందం

తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో యూరోప్‌లోని విఖ్యాత క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి ఆసియాకు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

ఇటీవల ఇంగ్లండ్‌కు చెందిన మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నాసర్‌ క్లబ్‌తో రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రొనాల్డో ఒప్పందం మొత్తాన్ని అల్‌ నాసర్‌ క్లబ్‌ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఒప్పందం ద్వారా రొనాల్డో ఏడాదికి 20 కోట్ల యూరోలు (రూ.1,755 కోట్లు) ఆర్జిస్తాడని సమాచారం.

Shane Warne: షేన్‌వార్న్‌కు ఆసీస్‌ బోర్డు సముచిత గౌరవం
ఫలితంగా ఇది ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధిక ఒప్పందం కానుంది. 37 ఏళ్ల రొనాల్డో 2025 జూన్‌ వరకు అల్‌ నాసర్‌ క్లబ్‌ తరఫున సౌదీ ప్రొ లీగ్‌లో ఆడతాడు. గతంలో సౌదీ ప్రొ లీగ్‌ టైటిల్‌ను అల్‌ నాసర్‌ క్లబ్‌ తొమ్మిదిసార్లు సాధించింది. ‘మరో దేశంలో కొత్త ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌లోని అన్ని ప్రముఖ టైటిల్స్‌ను సాధించాను. ఇక ఆసియా ఆటగాళ్లతోనూ నా అనుభవాన్ని పంచుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను’ అని రొనాల్డో వ్యాఖ్యానించాడు. మాడ్రిడ్‌లో జరిగిన కార్యక్రమంలో తాను ధరించనున్న ఏడో నంబర్‌ జెర్సీని అల్‌ నాసర్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముసాలి అల్‌ ముమార్‌తో కలిసి రొనాల్డో ఆవిష్కరించాడు.  
ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన క్లబ్‌ల సంఖ్య 6. గతంలో రొనాల్డో స్పోర్టింగ్‌ లిస్బన్‌ (పోర్చుగల్‌; 2002–2003), మాంచెస్టర్‌ యునైటెడ్‌ (ఇంగ్లండ్‌; 2003 నుంచి 2009 వరకు; 2021 నుంచి 2022 వరకు), రియల్‌ మాడ్రిడ్‌ (స్పెయిన్‌; 2009 నుంచి 2018 వరకు), యువెంటస్‌ (ఇటలీ; 2018 నుంచి 2021) తరఫున పోటీపడ్డాడు. తాజాగా అల్‌ నాసర్‌ క్లబ్‌కు ఆడనున్నాడు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 02 Jan 2023 03:50PM

Photo Stories