Skip to main content

Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్‌ గుడ్‌బై

ఆ్రస్టేలియా టి20 జట్టు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.

అయితే స్వదేశంలో జరిగే బిగ్‌బాస్‌, ఇతర దేశాల్లో జరిగే టి20 లీగ్‌లలోనూ ఆడతానని 36 ఏళ్ల ఫించ్‌ తెలిపాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన ఆ్రస్టేలియా జట్టులో సభ్యుడైన ఫించ్‌.. 2021తో తన కెపె్టన్సీలో ఆ్రస్టేలియాకు తొలిసారి టి20 ప్రపంచకప్‌ను అందించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఫించ్‌ ఆ్రస్టేలియా తరఫున ఐదు టెస్టుల్లో (278 పరుగులు), 146 వన్డేల్లో (5406 పరుగులు), 103 టి20ల్లో (3120 పరుగులు) ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా (172; జింబాబ్వేపై 2018లో).. అత్యధిక మ్యాచ్‌ల్లో (76) కెపె్టన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గా ఫించ్‌ పేరిట రికార్డులు ఉన్నాయి.  

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం

Published date : 08 Feb 2023 03:51PM

Photo Stories