Asian Games 2022: వాయిదా పడిన ఆసియా క్రీడలు
చైనాలో కోవిడ్ కేసులు పెరగడంతో ఆసియా క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10–25 మధ్య చైనాలోని హాంగ్‌జౌలో19వ ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది. చైనా వ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు తిరిగి పెరిగాయి. దాంతో ఇటీవల సమావేశమైన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు.. క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది.
భారత స్టార్ డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై వేటు
నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో కమల్ ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ సస్పెన్షన్ విధించింది. ఆమె దోషిగా తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడుతుంది. 26ఏళ్ల కమల్ ప్రీత్‌కు ఎప్పుడు పరీక్ష నిర్వహించారన్న వివరాలు తెలియలేదు. ప్రస్తుతం జాతీయ రికార్డు (65.06 మీటర్లు) కమల్ ప్రీత్ పేరిటే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె అనూహ్య ప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది.
Weightlifting: జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణి?