Handball: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు?
భారత మహిళల హ్యాండ్‌బాల్ జట్టు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించింది. కజకిస్తాన్‌లోని అల్మాటిలో జరిగిన ఆసియా మహిళల జూనియర్ చాంపియన్‌షిప్-2022లో భారత్ విజేతగా నిలవడం ద్వారా మెగా టోర్నీకి అర్హత పొందింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. మార్చి 14న జరిగిన ఆఖరి నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు 41–18తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, థాయ్‌లాండ్‌లపై నెగ్గగా, ఇరాన్ చేతిలో ఓడింది. తద్వారా 6 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. 2022 ఏడాది స్లొవేనియాలో జూన్ 22 నుంచి జూలై 3 వరకు జరిగే మహిళల జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తలపడనుంది.
Tennis: ఐటీఎఫ్ టోర్నీలో విజేతగా నిలిచిన జోడి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా మహిళల జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్-2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : భారత జట్టు
ఎక్కడ : అల్మాటి, కజకిస్తాన్
ఎందుకు : ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్ 6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్