ఆగస్టు 2020 అవార్డ్స్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌కు ఐసీఏఆర్ జాతీయ అవార్డు
అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు 2020వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది.తమిళనాడు తిరుచిరాపల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) అనుబంధ అరటి పరిశోధన కేంద్రంలో ఆగస్టు 21న నిర్వహించిన కిసాన్ మేళాలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఐదేళ్ల కిందట 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరిందని వివరించారు. మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీఏఆర్ జాతీయ అవార్డు-2020 విజేత
ఎప్పుడు: ఆగస్టు 21
ఎవరు: ఆంధ్రప్రదేశ్
ఎక్కడ :ఐసీఏఆర్అనుబంధ అరటి పరిశోధన కేంద్రం, తిరుచిరాపల్లి, తమిళనాడు
ఎందుకు:అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించినందుకు
అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్
దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది. ఇండోర్ తర్వాత సూరత్, నవీముంబైలు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు 4,242 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్-2020’ ర్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. స్వచ్ఛ మహోత్సవ్ సందర్భంగా ఆగస్టు 20న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం...
ఏమిటి: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది ఎంపిక
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: ఇండోర్
ఎక్కడ : మధ్యప్రదేశ్
పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఏపీకి ఆరో స్థానం
పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాలు కూడా జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నాయి. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం (2018–19లో ర్యాంక్ 20) సాధించింది. 2019–20 ఏడాదికి కేంద్రప్రభుత్వం ఆగస్టు 20న ప్రకటించిన ర్యాంకుల్లో 10 లక్షల కంటే మించిన జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించగా.. విశాఖపట్నానికి తొమ్మిదో ర్యాంకు దక్కింది. 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో తిరుపతికి ఆరో ర్యాంకు లభించింది. 4,242 నగరాలు/పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో కేంద్రం స్వచ్ఛ్ సర్వే నిర్వహించింది.
వివిధ కేటగిరీల్లో ఏపీ ర్యాంకులు...
ఏమిటి: పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఏపీకి ఆరో స్థానం
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు:స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకులు
ఎక్కడ : దేశంలో
బెస్ట్ సిటీ కేటగిరీలో హైదరాబాద్‌కు మొదటి స్థానం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు పట్టణాలు వివిధ కేటగిరీల్లో ర్యాంకులు సాధించాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన ఈ సర్వే ఫలితా లను ఆగస్టు 20న స్వచ్ఛ మహోత్సవ్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. 40 లక్షలకు పైబడిన జనాభా కలిగిన పట్టణాల్లో హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్’ లకేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సిటిజన్ లెడ్ ఇనిషియేటివ్ కేటగిరీ’లో కరీంనగర్ అగ్రస్థానం సాధిం చింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన పట్టణాల్లో దక్షిణాదిలో ‘బెస్ట్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీ’గా జహీరాబాద్ నిలిచింది. +
క్లీన్ సిటీగా మేడ్చల్..
దక్షిణాదిలో 25వేల నుంచి 50వేల జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో క్లీన్ సిటీగా మేడ్చల్ మున్సిపాలిటీకి ప్రథమ స్థానం దక్కింది. లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో జాతీయ స్థాయిలో కరీంనగర్ 72, నిజామాబాద్ 133వ స్థానంలో నిలిచాయి. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో జోనల్ స్థాయిలో సిరిసిల్ల 16, సిద్దిపేట 27, జహీరాబాద్ 31, గద్వాల 38, బోడుప్పల్ 42, వనపర్తి 51వ స్థానాల్లో నిలిచాయి. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో హుజూర్ నగర్ 9, షాద్‌నగర్ 15, మెదక్ 24, కల్వకుర్తి 26వ స్థానం సాధించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: బెస్ట్ సిటీ కేటగిరీలో హైదరాబాద్‌కు మొదటి స్థానం
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకులు
ఎక్కడ : దేశంలో
బీ పోస్ట్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ అవార్డు
మహిళా స్వయం సహాయక సంఘాల సమస్యల పరిష్కారానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ (బీ పోస్ట్) వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు–2020’దక్కింది. ఈ అవార్డును ఆగస్టు 26న జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి స్వీకరించారు. కాగ్నిటో
చైన్ స్టార్టప్ రూపొందించిన ‘బ్లాక్ చెయిన్ ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్సాక్షన్స్’(బీ పోస్ట్) యాప్ ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థిక లావాదేవీలు సులభతరం కానున్నాయి.
వ్యవసాయోత్పత్తులపై 154వ నివేదిక
వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయనం చేసింది. అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి ఆగస్టు 26న ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమరి్పంచారు. దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని ఈ నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు–2020 విజేత
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : బ్లాక్ చెయిన్ ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్సాక్షన్స్ (బీ పోస్ట్) యాప్
శౌర్యచక్ర అవార్డులు-2020
2020 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా నలుగులు శౌర్యచక్ర అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు రక్షణ బలగాలకు ఇచ్చే వివిధ గ్యాలెంటరీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ ఏడాది శౌర్యచక్ర పురస్కారానికి ముగ్గురు ఆర్మీ నుంచి, ఒకరు వైమానికదళం నుంచి ఎంపికయ్యారని రక్షణ శాఖ ఆగస్టు 14న తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవల్దార్ అలోక్ కుమార్ దూబే ఆర్మీ నుంచి, ఎయిర్‌ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ విశాక్ నాయర్ శౌర్యచక్రకు ఎంపికయ్యారు.
19 మందికి ఎంఐడీ గౌరవం...
శౌర్యచక్రకు ఎంపికైన వారితో పాటు... 60 మంది ఆర్మీ ఆఫీసర్లకు సేనా మెడల్స్, నలుగురు నేవీ అధికారులకు నవో సేనా మెడల్స్, ఐదుగురు ఎయిర్‌ఫోర్స్ అధికారులకు వాయు సేనా మెడల్స్‌కు ఎంపికయ్యారు. మరో 19 మంది ఆర్మీ అధికారులకు మెన్షన్ ఇన్ డిస్పాచ్(ఎంఐడీ) గౌరవం దక్కనుంది. ఇందులో 8 మంది మరణానంతరం ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: శౌర్యచక్ర అవార్డులు-2020కి ఎంపిక
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు :లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవల్దార్ అలోక్ కుమార్ దూబే, వింగ్ కమాండర్ విశాక్ నాయర్
తిరునగరి రామానుజానికి దాశరథి పురస్కారం
సాహితీవేత్త తిరునగరి రామానుజానికి మహాకవి దాశరథి పురస్కారం–2020 లభించింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో ఆగస్టు 15న జరిగిన కార్యక్రమంలో... తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ పురస్కారాన్ని రామానుజానికి అందజేశారు. జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని పేర్కొన్నారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండటంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని కొనియాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మహాకవి దాశరథి పురస్కారం–2020స్వీకరణ
ఎప్పుడు: ఆగస్టు 15
ఎవరు: తిరునగరి రామానుజం
ఎక్కడ: ప్రగతి భవన్, హైదరాబాద్
గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సర్టిఫికెట్
అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేథావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. లండన్ లో జూలై 30న జరిగిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధులు శకుంతలాదేవి కుమార్తె అనుపమా బెనర్జీకి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. 1980లో లండన్ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే, అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ఆమె 2013లో బెంగళూరులో చనిపోయారు.
బయోపిక్...
అరుణ్ మేనన్దర్శకత్వంలో శకుంతలాదేవి బయోపిక్ రూపొందింది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ప్రధాన పాత్ర పోషించిన ‘శకుంతలాదేవి’ సినిమా అమెజాన్ప్రైమ్‌లో జూలై 31న విడుదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సరి్టఫికెట్
ఎప్పుడు: జూలై 30
ఎందుకు: 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించి రికార్డు నెలకొల్పినందున
రామ్‌కో సిమెంట్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు < br /> రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ (తమిళనాడు) యూనిట్‌కు ‘గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు, 2020’ లభించింది. వార్షిక గోల్డెన్ పీకాక్ అవార్డులకు 344 కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నిర్వహణ, సాంకేతికత, శిక్షణా వ్యవహారాలు ప్రత్యేకించి జీవిత సమతౌల్యతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు, సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ విభాగం ఎంపికయ్యింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని జ్యూరీ అవార్డుకు సంబంధించి ట్రోఫీ, ప్రశంశాపత్రాన్ని యూనిట్‌కు ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు, 2020 విజేత
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ (తమిళనాడు) యూనిట్
ఎందుకు:నిర్వహణ, సాంకేతికత, శిక్షణా వ్యవహారాలు ప్రత్యేకించి జీవిత సమతౌల్యతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు, సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలకుగాను

- 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
- ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది.
- దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికైంది.
- - పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది.
- పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది.
- ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది.
- ఇండోర్
- సూరత్
- నవీముంబై
- విజయవాడ
- అహ్మదాబాద్
- కరాడ్
- సస్వద్
- లోనావాలా
- ఛత్తీస్‌గఢ్
- మహారాష్ట్ర
- మధ్యప్రదేశ్
- న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్
- జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్
- ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్
- మీరట్ కంటోన్మెంట్ బోర్డ్
ఏమిటి: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది ఎంపిక
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: ఇండోర్
ఎక్కడ : మధ్యప్రదేశ్
పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఏపీకి ఆరో స్థానం
పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాలు కూడా జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నాయి. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం (2018–19లో ర్యాంక్ 20) సాధించింది. 2019–20 ఏడాదికి కేంద్రప్రభుత్వం ఆగస్టు 20న ప్రకటించిన ర్యాంకుల్లో 10 లక్షల కంటే మించిన జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించగా.. విశాఖపట్నానికి తొమ్మిదో ర్యాంకు దక్కింది. 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో తిరుపతికి ఆరో ర్యాంకు లభించింది. 4,242 నగరాలు/పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో కేంద్రం స్వచ్ఛ్ సర్వే నిర్వహించింది.
వివిధ కేటగిరీల్లో ఏపీ ర్యాంకులు...
- 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో ర్యాంక్ సాధించింది.
- 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో రాజమహేంద్రవరం 51, ఒంగోలు 57, కాకినాడ 58, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, హిందూపూర్ 93, తాడిపత్రి 99 ర్యాంకులు దక్కించుకున్నాయి.
- 10 లక్షల నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో అతిపెద్ద శుభ్రమైన నగరంగా విజయవాడ
- లక్ష నుంచి 3 లక్షలు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఉత్తమ స్థిరమైన (సస్టైన్‌బుల్) చిన్ననగరంగా తిరుపతి
- 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా చీరాల.
- 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా ఆత్మకూరు.
- సౌత్ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగినవాటిలో పరిశుభ్రమైన నగరంగా పలమనేరు
- 25 వేలు లోపు జనాభా కలిగిన వాటిలో అతిచిన్న ఫాస్ట్ మూవింగ్ సిటీగా ముమ్మడివరం
- 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన నగరాల కేటగిరీలో సౌత్ జోన్‌లో టాప్–100 ర్యాంకుల్లో ఏకంగా 40 ర్యాంకులు రాష్ట్రానికి దక్కాయి. 1 నుంచి 8 ర్యాంకులు పలమనేరు, చీరాల, పుంగనూరు, కందుకూరు, మండపేట, పులివెందుల, నర్సాపూర్, తణుకు సాధించాయి.
- 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో టాప్–10లో పుట్టపర్తి 2, జమ్మలమడుగు 5, నిడదవోలు 6, రామచంద్రాపురం 7వ ర్యాంకులు సాధించాయి. ఈ కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో మన రాష్ట్రానికి 32 ర్యాంకులు దక్కాయి.
ఏమిటి: పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఏపీకి ఆరో స్థానం
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు:స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకులు
ఎక్కడ : దేశంలో
బెస్ట్ సిటీ కేటగిరీలో హైదరాబాద్‌కు మొదటి స్థానం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు పట్టణాలు వివిధ కేటగిరీల్లో ర్యాంకులు సాధించాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన ఈ సర్వే ఫలితా లను ఆగస్టు 20న స్వచ్ఛ మహోత్సవ్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. 40 లక్షలకు పైబడిన జనాభా కలిగిన పట్టణాల్లో హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్’ లకేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సిటిజన్ లెడ్ ఇనిషియేటివ్ కేటగిరీ’లో కరీంనగర్ అగ్రస్థానం సాధిం చింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన పట్టణాల్లో దక్షిణాదిలో ‘బెస్ట్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీ’గా జహీరాబాద్ నిలిచింది. +
క్లీన్ సిటీగా మేడ్చల్..
దక్షిణాదిలో 25వేల నుంచి 50వేల జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో క్లీన్ సిటీగా మేడ్చల్ మున్సిపాలిటీకి ప్రథమ స్థానం దక్కింది. లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో జాతీయ స్థాయిలో కరీంనగర్ 72, నిజామాబాద్ 133వ స్థానంలో నిలిచాయి. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో జోనల్ స్థాయిలో సిరిసిల్ల 16, సిద్దిపేట 27, జహీరాబాద్ 31, గద్వాల 38, బోడుప్పల్ 42, వనపర్తి 51వ స్థానాల్లో నిలిచాయి. 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో హుజూర్ నగర్ 9, షాద్‌నగర్ 15, మెదక్ 24, కల్వకుర్తి 26వ స్థానం సాధించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: బెస్ట్ సిటీ కేటగిరీలో హైదరాబాద్‌కు మొదటి స్థానం
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకులు
ఎక్కడ : దేశంలో
బీ పోస్ట్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ అవార్డు
మహిళా స్వయం సహాయక సంఘాల సమస్యల పరిష్కారానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ (బీ పోస్ట్) వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు–2020’దక్కింది. ఈ అవార్డును ఆగస్టు 26న జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి స్వీకరించారు. కాగ్నిటో
చైన్ స్టార్టప్ రూపొందించిన ‘బ్లాక్ చెయిన్ ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్సాక్షన్స్’(బీ పోస్ట్) యాప్ ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థిక లావాదేవీలు సులభతరం కానున్నాయి.
వ్యవసాయోత్పత్తులపై 154వ నివేదిక
వ్యవసాయ, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరిపీచు, పసుపు ఉత్పాదనల ఎగుమతులపై పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయనం చేసింది. అధ్యయనం, సిఫార్సులకు సంబంధించిన 154వ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి ఆగస్టు 26న ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమరి్పంచారు. దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం సరుకులలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా సగటున 1 శాతం కూడా ఉండటం లేదని ఈ నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డు–2020 విజేత
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : బ్లాక్ చెయిన్ ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్సాక్షన్స్ (బీ పోస్ట్) యాప్
శౌర్యచక్ర అవార్డులు-2020
2020 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా నలుగులు శౌర్యచక్ర అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు రక్షణ బలగాలకు ఇచ్చే వివిధ గ్యాలెంటరీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ ఏడాది శౌర్యచక్ర పురస్కారానికి ముగ్గురు ఆర్మీ నుంచి, ఒకరు వైమానికదళం నుంచి ఎంపికయ్యారని రక్షణ శాఖ ఆగస్టు 14న తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవల్దార్ అలోక్ కుమార్ దూబే ఆర్మీ నుంచి, ఎయిర్‌ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ విశాక్ నాయర్ శౌర్యచక్రకు ఎంపికయ్యారు.
19 మందికి ఎంఐడీ గౌరవం...
శౌర్యచక్రకు ఎంపికైన వారితో పాటు... 60 మంది ఆర్మీ ఆఫీసర్లకు సేనా మెడల్స్, నలుగురు నేవీ అధికారులకు నవో సేనా మెడల్స్, ఐదుగురు ఎయిర్‌ఫోర్స్ అధికారులకు వాయు సేనా మెడల్స్‌కు ఎంపికయ్యారు. మరో 19 మంది ఆర్మీ అధికారులకు మెన్షన్ ఇన్ డిస్పాచ్(ఎంఐడీ) గౌరవం దక్కనుంది. ఇందులో 8 మంది మరణానంతరం ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: శౌర్యచక్ర అవార్డులు-2020కి ఎంపిక
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు :లెఫ్టినెంట్ కల్నల్ క్రిషన్ సింగ్ రావత్, మేజర్ అనిల్ ఉర్స్, హవల్దార్ అలోక్ కుమార్ దూబే, వింగ్ కమాండర్ విశాక్ నాయర్
తిరునగరి రామానుజానికి దాశరథి పురస్కారం
సాహితీవేత్త తిరునగరి రామానుజానికి మహాకవి దాశరథి పురస్కారం–2020 లభించింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో ఆగస్టు 15న జరిగిన కార్యక్రమంలో... తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ పురస్కారాన్ని రామానుజానికి అందజేశారు. జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని పేర్కొన్నారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండటంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని కొనియాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మహాకవి దాశరథి పురస్కారం–2020స్వీకరణ
ఎప్పుడు: ఆగస్టు 15
ఎవరు: తిరునగరి రామానుజం
ఎక్కడ: ప్రగతి భవన్, హైదరాబాద్
గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సర్టిఫికెట్
అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేథావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. లండన్ లో జూలై 30న జరిగిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధులు శకుంతలాదేవి కుమార్తె అనుపమా బెనర్జీకి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. 1980లో లండన్ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే, అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ఆమె 2013లో బెంగళూరులో చనిపోయారు.
బయోపిక్...
అరుణ్ మేనన్దర్శకత్వంలో శకుంతలాదేవి బయోపిక్ రూపొందింది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ప్రధాన పాత్ర పోషించిన ‘శకుంతలాదేవి’ సినిమా అమెజాన్ప్రైమ్‌లో జూలై 31న విడుదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సరి్టఫికెట్
ఎప్పుడు: జూలై 30
ఎందుకు: 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించి రికార్డు నెలకొల్పినందున
రామ్‌కో సిమెంట్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు < br /> రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ (తమిళనాడు) యూనిట్‌కు ‘గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు, 2020’ లభించింది. వార్షిక గోల్డెన్ పీకాక్ అవార్డులకు 344 కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నిర్వహణ, సాంకేతికత, శిక్షణా వ్యవహారాలు ప్రత్యేకించి జీవిత సమతౌల్యతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు, సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ విభాగం ఎంపికయ్యింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని జ్యూరీ అవార్డుకు సంబంధించి ట్రోఫీ, ప్రశంశాపత్రాన్ని యూనిట్‌కు ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు, 2020 విజేత
ఎప్పుడు: ఆగస్టు 3
ఎవరు: రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ (తమిళనాడు) యూనిట్
ఎందుకు:నిర్వహణ, సాంకేతికత, శిక్షణా వ్యవహారాలు ప్రత్యేకించి జీవిత సమతౌల్యతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు, సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలకుగాను
Published date : 01 Sep 2020 12:10PM