Chess: సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించిన ఆటగాడు?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వేదికగా జరిగిన 58వ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో మార్చి 3న గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ విజేతగా నిలిచాడు. దీంతో సీనియర్ టైటిల్ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా అర్జున్ ఘనత వహించాడు. టైటిల్ రేసులో.. 18 ఏళ్ల అర్జున్‌తో పాటు తమిళ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ఇనియన్ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్ స్కోరుతో అర్జున్‌ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడు అర్జున్‌కి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
చదవండి: భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన సౌరభ్ చౌదరీ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 58వ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆటగాడు?
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్
ఎక్కడ : కాన్పూర్, ఉత్తరప్రదేశ్
ఎందుకు : 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండటంతోపాటు.. మెరుగైన టైబ్రేక్ స్కోరు కలిగి ఉన్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్