24th Summer Deaflympics: బధిరుల ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి?
బ్రెజిల్‌లోని కాక్సియాల్ డు సల్ వేదికగా జరుగుతోన్న 24వ బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ కాంస్య పతకం సాధించింది. మే 15న జరిగిన టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్ దూబే జంటను ఓడించింది. ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్.
త్రిపుర రాష్ట్ర నూతన సీఎంగా ఎవరు ప్రమాణం చేశారు?
త్రిపుర రాజకీయాల్లో మే 14న అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ (50) రాజీనామా చేయడం, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాణిక్ సాహా(69) ప్రమాణ స్వీకారం జరిగిపోయాయి.
యూఏఈ కొత్త అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా దివంగత నేత షేక్ ఖలీఫా సవతి సోదరుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (61) ఎంపికయ్యారు. ఆయన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నట్టు యూఏఈలోని ఏడు ముస్లిం దేశాల పాలకులు మే 14న ప్రకటించారు.Badminton: థామస్ కప్ టీమ్ టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 24వ బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో కాంస్యం గెలిచిన కాంస్యం గెలిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి?
ఎప్పుడు : మే 15
ఎవరు : షేక్ జాఫ్రీన్
ఎక్కడ : కాక్సియాల్ డు సల్, బ్రెజిల్
ఎందుకు : టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్ దూబే జంటపై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్