Skip to main content

Covid Treatment: ఒమిక్రాన్‌పై పనిచేసే ఔషధాన్ని గుర్తించాం: బ్రిటన్‌

Omicron

ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న కరోనా కొత్త వేరియంట్‌ ‘‘ఒమిక్రాన్‌’’పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని బ్రిటన్‌ గుర్తించింది. ఒమిక్రాన్‌ను నియంత్రించేందుకు ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్‌ క్లైన్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘‘సోట్రోవిమాబ్‌’’ వినియోగానికి బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా సోకిన వారికి సోట్రోవిమాబ్‌ను ఉపయోగించిన చికిత్స చేయగా, వారిలో మరణించే ప్రమాదం 79 శాతం తగ్గినట్టు వెల్లడైంది.

ఐదు రోజుల్లోగా..

సోట్రోవిమాబ్‌ను నరాల ద్వారా ఎక్కించగా, కరోనా వైరస్‌ మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన తొలినాళ్లలో సోట్రోవిమాబ్‌ సింగిల్‌ డోస్‌ ఇస్తే, మంచి పనితీరు కనబరుస్తుందని వివరించారు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా దీన్ని వాడాలని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: కోవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?

టీకా రక్షిస్తుందా.. లేదా..?!

corona Vaccine

కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం అయ్యేలా లేదు. కాలం గడుస్తున్న కొద్ది.. మహమ్మారి తన రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా మానవాళి మీద దాడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు డెల్టా వేరియంట్‌ జనాలను బెంబెలెత్తించింది. దాన్నుంచి తేరుకుని.. కాస్త ఊపిరి పీల్చుకునే సమయానికి ఒమిక్రాన్‌ దాడి ప్రారంభించింది. ఒమిక్రాన్‌ డెల్టా కన్నా కూడా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. అప్పుడే ప్రపంచ దేశాలను చుట్టేస్తూ.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తకుండా..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నిపుణుడు అన్నే వాన్ గాట్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘గతంలో కోవిడ్‌ బారిన పడినవారికి.. ఒమిక్రాన్‌ సోకదనే గ్యారెంటీ లేదు. గతంలో సోకిన ఇన్‌ఫెక్షన్‌.. ఒమిక్రాన్‌ నుంచి కాపాడలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహమ్మారి ముప్పు ముంచుకొస్తున్న వేళ వ్యాక్సిన్‌ మాత్రమే మనల్ని కాపాడగలదు. తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా ఉండటమే కాక.. మహమ్మారి సోకితే పరిస్థితి విషమించకుండా.. ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తకుండా టీకా మనల్ని సంరక్షిస్తుంది’’ అని తెలిపారు. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో వెలుగు చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు.. సౌతాఫ్రికా, దాని చుట్టుపక్కల దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల నిర్ణయంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మేలు కోసం మేం ఒమిక్రాన్‌ ఉనికి గురించి ముందుగానే హెచ్చరిస్తే.. మాపై ఇలా నిషేధం విధించడం తగదన్నారు.

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Dec 2021 12:55PM

Photo Stories