GMRకు కౌలనాము ఎయిర్‌పోర్ట్ నిర్వహణ
Sakshi Education
ఇండోనేషియాలోని మెడాన్‌లో ఉన్న కౌలనాము అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అంకసపుర అవియాసి ప్రారంభించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఇండోనే షియా ప్రభుత్వ సంస్థ పీటీ అంకసపుర–2 సంయుక్త భాగస్వామ్య కంపెనీయే అంకసపుర అవియాసి. ఈ జాయింట్ వెంచర్ లో జీఎంఆర్‌కు 49% వాటా ఉంది. 25 ఏళ్లపాటు నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులను చేపడుతుంది.
Also read: Indian Air Force: భారత వాయుసేనలో తండ్రీ తనయ రికార్డ్
జీఎంఆర్ నిర్వహణలో ఆగ్నే యాసియాలో ఇది రెండవ విమానాశ్రయ ప్రాజెక్టు. మొదటిది ఫిలిప్పీన్స్ లోని మాక్టాన్ కెబు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (MCIA). ఇదే సంస్థ ఫిలిప్పీన్స్ లోని కార్ల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను ఇటీవలే పూర్తి చేసింది. గ్రీస్ లోని క్రెటెలో త్వరలో నూతన ఎయిర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతలూ చేపట్టనుంది.
Published date : 09 Jul 2022 03:07PM