Safran Electric and Aircraft Engine ఫ్యాక్టరీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీఎంఆర్ హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఫ్రాన్స్‌కు చెందిన విమాన రంగ ఉత్పత్తుల సంస్థ శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫెసిలిటీ కేంద్రాలను జూలై 7న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు.. వైమానిక రంగంలోని నిర్వహణ, మరమ్మతుల రంగంలో కేవలం దేశంలోనే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాఫ్రాన్ సంస్థ ప్రారంభించ బోయే నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్‌ఓ) అంతర్జాతీయంగా హైదరాబాద్‌ను మరో స్థానానికి తీసుకెళ్తుందని చెప్పారు.
Also read: Face Recognition: ఇండియన్ రైల్వేలో విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ
విమాన ఇంజన్‌లకు వైర్ హార్నెస్‌లను శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. సీఎఫ్‌ఎం, లీప్ ఇంజిన్ల కోసం అతిపెద్ద నిర్వహణ మరమ్మతుల కేంద్రాన్ని (ఎంఆర్‌ఓ) త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు శాఫ్రాన్ గ్రూప్ సీఈఓ ఒలివియర్ ఆండ్రీస్ ప్రకటించారు. మేకిన్ ఇండియాలో భాగంగా 2025 నాటికి 200 మిలి యన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.