DRDO: అగ్ని–3 పరీక్ష సక్సెస్
Sakshi Education
మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని–3 పరీక్షను భారత్ నవంబర్ 23న విజయవంతంగా నిర్వహించింది.
ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ ప్రయోగాల్లో భాగంగా వ్యూహాత్మక దళాల కమాండ్ దీన్ని చేపట్టాయని అధికారిక ప్రకటన పేర్కొంది. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణి 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Dec 2022 05:19PM