Electric vehicle unit in AP: చిత్తూరు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్!
చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Double digit growth in AP: ఏపీలో అన్ని రంగాల్లో ఏటా రెండంకెల వృద్ధి
సుమారు రూ.4,640 కోట్లు (600 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 8080 మందికి ఉపాధి లభిస్తుంది. టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్‌తో పాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
2025 నాటికి ఉత్పత్తి ప్రారంభం
ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణం ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి, అంతర్జాతీయంగా సరఫరా చేయనున్నట్లు తెలిపింది.
Varikapudisela Lift Irrigation Scheme: వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం