Skip to main content

UNICEF: రాష్ట్ర సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేస్తోన్న ఐరాస అనుబంధ సంస్థ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్‌) ముందుకొచ్చింది.
AP GOVT-UNICEF

ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యునిసెఫ్‌ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్‌) కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మరో ముగ్గురు యునిసెఫ్‌ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్‌ పనిచేస్తుంది. 2021, జూన్‌ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యునిసెఫ్‌ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యునిసెఫ్‌ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధుల నియమించటం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి.

పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యునిసెఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. యునిసెఫ్‌(United Nations Children’s Fund-UNICEF) ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.  

చ‌దవండి: అంతరించిపోతున్న జీవజాలం వివరాలను నమోదు చేసే సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేస్తోన్న ఐరాస అనుబంధ సంస్థ?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 13
ఎవరు    : ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్‌)
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు   : రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు...

Published date : 14 Sep 2021 04:49PM

Photo Stories