Skip to main content

Translumina: ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటుకానుంది?

Translumina

విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌)లో గుండె వాల్వుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ట్రాన్స్‌లూమినా సంస్థ ఇటీవల భూమిపూజ చేసింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌ పనులను 2022, డిసెంబర్‌ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీ కేంద్రంగా ఇది నిలవనుంది. ఈ యూనిట్‌లో ట్రాన్స్‌కేథటర్, మిట్రల్, ట్రైకుస్పిడ్‌ వాల్వులను తయారు చేయనున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి పెట్టనున్నారనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
చ‌ద‌వండి: సన్‌ ఫార్మా తయారీ ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటుకానుంది?
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు    : ట్రాన్స్‌లూమినా సంస్థ 
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌), విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Dec 2021 06:07PM

Photo Stories