Skip to main content

Jute Industry: రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న కంపెనీలు?

తెలంగాణ రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమల స్థాపనకు మూడు ప్రసిద్ధ కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.887 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్లోస్టర్‌ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ కంపెనీలు అంగీకరించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
Jute Industry

ఇందులో భాగంగా వరంగల్‌ జిల్లాలో గ్లోస్టర్‌ కంపెనీ రూ.330 కోట్లు, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్‌ రూ. 254 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ రూ. 303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సోమాజిగూడలో జరిగిన కార్యక్రమంలో ఈ మూడు కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి.

కైటెక్స్‌ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో పాటు హైదరాబాద్‌ పారిశ్రామిక పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో  అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కైటెక్స్‌ గ్రూప్‌ సెప్టెంబర్‌ 17న ప్రకటించింది.

చ‌ద‌వండి: దేశంలో తొలి క్యాన్సర్‌ న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఎక్కడ ఏర్పాటైంది?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 17
ఎవరు    : గ్లోస్టర్‌ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ కంపెనీ
ఎందుకు  : వరంగల్‌ జిల్లా(గ్లోస్టర్‌ కంపెనీ),కామారెడ్డి జిల్లా(కాళేశ్వరం అగ్రో లిమిటెడ్‌), సిరిసిల్ల జిల్లా(ఎంజీబీ కమోడిటీస్‌ లిమిటెడ్‌)ల్లో  జూట్‌ పరిశ్రమల స్థాపనకు...

Published date : 18 Sep 2021 04:32PM

Photo Stories