Telangana Budget 2023–24 Highlights: తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023–2024–కేటాయింపులు
Sakshi Education
2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
- నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
- హోంశాఖకు రూ.9,599 కోట్లు
- ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు
- విద్యాశాఖకు రూ.19,093 కోట్లు
- వైద్య రంగానికి రూ.12,161 కోట్లు
- ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1463 కోట్లు.
- పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11,327 కోట్లు
- ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
- ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు
- ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు
- రుణమాఫీకి రూ.6,385 కోట్లు.
- రైతుబంధుకి రూ.15,075 కోట్లు
- రైతుబీమాకి రూ.1589 కోట్లు
- కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ. 200 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.3,210 కోట్లు
- దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
- మహిళా,శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు
- ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
- మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు
- గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
- ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు
- అటవీ శాఖ కోసం రూ.1,471 కోట్లు
- హరితహారం పథకానికి రూ.1471 కోట్లు
- పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ.4,834 కోట్లు
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Feb 2023 02:01PM