Single-Use Plastics: ప్లాస్టిక్ కవర్లపై నిషేధాన్ని ఎన్ని మైక్రాన్లకు విస్తరించారు?
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు, వినియోగంపై అక్టోబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. అక్టోబర్ 14 నుంచి 2022, ఏడాది జూన్ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. 2022, ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది.
ఇప్పటివరకు...
ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. 2021, సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, 2022, డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
చదవండి: చిక్కుళ్ల శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల పాలకుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు, వినియోగంపై నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ
ఎక్కడ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : పర్యావరణానికి హాని కలిగిస్తున్నందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్