Netanna Bima : ఆగస్టు 7 నుంచి ప్రారంభం
రైతు బీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగుతుందన్నారు. చేనేత, మరమగ్గాలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని, లబ్ధిదారులు ఏదైనా కారణంతో మరణిస్తే 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేస్తామన్నారు. చేనేత, జౌళి విభాగంఈ పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. బీమా వార్షిక ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని, నేత కార్మికులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ. 50 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.
also read: Weekly Current Affairs (Sports) Bitbank: భారతదేశ 74వ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP