Munugode By Election Schedule : మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదే..
6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 7న విడుదల కానుంది. మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
మునుగోడు ఉప ఎన్నికల ముఖ్యమైన తేదీలు ఇవే..
☛ మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్- అక్టోబర్ 7
☛ నామినేషన్ల స్వీకరణ గడువు -అక్టోబర్ 14
☛ నామినేషన్ల పరిశీలన- అక్టోబర్ 15
☛ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ - అక్టోబర్ 17
☛ ఎన్నికల పోలింగ్ - నవంబర్ 3
☛ ఫలితాలు- నవంబర్ 6
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. 6 రాష్ట్రాల్లోని 7 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ 3వ తేదీన (సోమవారం) షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 14న నామినేషన్లు. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అక్టోబర్ 17 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు.
ఉప ఎన్నికలు జరిగే స్థానాలు (7) ఇవే.. :
➤ మహారాష్ట్ర-తూర్పు అంధేరి
➤ బిహార్-మోకమ
➤ బిహార్- గోపాల్‌గంజ్
➤ హరియాణ-అదంపూర్
➤ తెలంగాణ-మునుగోడు
➤ ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్
➤ ఒడిశా- ధామ్‌నగర్
>> Download Current Affairs PDFs Here