Indian Navy: ఏ యూనివర్సిటీతో ఇండియన్ నేవీ ఎంవోయూ చేసుకుంది?
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)తో ఇండియన్ నేవీ ఎంవోయూ కుదుర్చుకుంది. నావికాదళ ప్రాజెక్టుల నిర్వహణలో ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుల సహకారాన్ని కోరుతూ ఈ పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. అక్టోబర్ 4న ఏయూలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 4న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ పాల్గొన్నారు.
గ్లోబల్ క్యాన్సర్ రన్ పోస్టర్ ఆవిష్కరణ
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా అక్టోబర్ 10న నిర్వహించనున్న ‘గ్లోబల్ క్యాన్సర్ రన్’ పోస్టర్‌ను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అక్టోబర్ 4న విజయవాడలో ఆవిష్కరించారు. ఈ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా 93 దేశాల్లో ఒకేసారి వేలాదిమంది పాల్గొంటారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
చదవండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : ఇండియన్ నేవీ
ఎక్కడ : విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా
ఎందుకు : నావికాదళ ప్రాజెక్టుల నిర్వహణలో ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుల సహకారం కోసం...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్