Andhra Pradesh: మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం?
గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి.. రోజు వారీ తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి.. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించే బృహత్తర కార్యక్రమం.. ‘‘వైఎస్సార్ జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్(ఇఔఅ్క)’’ ప్రారంభమైంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న విజయవాడలోని బెంజి సర్కిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెత్త సేకరణకు 4,097 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం–ముఖ్యాంశాలు
- ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.
- రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ.. వంద రోజుల పాటు ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో రోజూ వారి వచ్చే 13,500 టన్నుల చెత్తను 23 వేల మంది గ్రీన్ అంబాసిడర్‌ల ద్వారా సేకరించనున్నారు.
- ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా.. ఆహ్లాదకరంగా తయారవుతాయి. పర్యావరణం మెరుగు పడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
- దేశంలో చెత్త నిర్మూలనకు.. పారిశుద్ధ్య సమస్యకు సంపూర్ణ పరిష్కారం చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.
- ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగించడానికి.. ప్రజల్లో జవాబుదారీతనం పెంచడానికి నిర్వహణ ఖర్చులకు మాత్రమే గ్రామాల్లో ఇంటికి రోజుకు కేవలం 50 పైసల నుండి రూ.1 వరకు.. పట్టణాల్లో ఇంటికి రోజుకు కేవలం రూ.1 నుండి రూ.4 వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తారు.
చదవండి: ఏ యూనివర్సిటీతో ఇండియన్ నేవీ ఎంవోయూ చేసుకుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘‘వైఎస్సార్ జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్(ఇఔఅ్క)’’ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్