Skip to main content

EWS Welfare Department: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం?

AP Logo

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం.. ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నవంబర్‌ 2న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే జైన్‌ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఏటా వైఎస్సార్‌ అవార్డులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర రెడ్డి పేరుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ఇక నుంచి ప్రతీ ఏటా ఆం‘ధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 1వ తేదీన ఇవ్వనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నవంబర్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రంగాల్లో అపారమైన సేవలందించిన వారిని సత్కరించేందుకు ఈ అవార్డులను ప్రభుత్వం నెలకొల్పిన విషయం తెలిసిందే.
 

 

చ‌ద‌వండి: వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మిస్తున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఎప్పుడు : నవంబర్‌ 2
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Nov 2021 04:07PM

Photo Stories