Cyber Safe Kiosks: సైబర్ కవచ్ పేరుతో సైబర్ కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 సైబర్ సేఫ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ నుంచి వీటిని కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది. 18 జిల్లా, అర్బన్ పోలీసు ప్రధాన కార్యాలయాల్లో, 18 దిశ పోలీస్‌స్టేషన్లలో, ప్రముఖ బస్‌స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మరో 14 కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. ఎవరికైనా తమ ఫోన్‌లో ప్రమాదకర వైరస్ చేరిందని సందేహం కలిగితే ఆ కియోస్క్‌కు తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు. కియోస్క్‌ల్లో ఆ స్మార్ట్ ఫోన్లను స్కాన్ చేసి పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకర వైరస్‌లు, మాల్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు ఉంటే తొలగిస్తారు. ఈ సేవలన్నీ కూడా ఉచితంగానే అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైబర్ కవచ్ పేరుతో సైబర్ కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : పోలీసు ప్రధాన కార్యాలయాల్లో, 18 దిశ పోలీస్‌స్టేషన్లలో, ప్రముఖ బస్‌స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో...
ఎందుకు : రాష్ట్రంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి...