Skip to main content

Green Energy:గ్రీన్‌ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ దిక్సూచి

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh Compass in Green Energy
Andhra Pradesh Compass in Green Energy
  • ఇటీవల కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) సందర్భంగా దావోస్‌లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.
  •  
  •  నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్, ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈవో ఆదిత్య మిట్టల్, గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ, సీఈవో అనిల్‌ చలమలశెట్టి, దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్‌ హెడ్‌ రిచర్డ్‌ సెషన్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు.

            ఏపీ.. ఎంతో అనుకూలం

  • ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టాం. గ్లోబల్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో కంపెనీతో కలసి పని చేస్తున్నాం. ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌ 27 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. 
  • Download Current Affairs PDFs Here
  • కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించా. అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి కానుండడం, తక్కువ నీటి వినియోగం నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5,000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చాం.
  •  భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. అన్ని రకాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం.– ఆదిత్య మిట్టల్, ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈవో
  • ప్రపంచానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చూపిన చొరవ యావత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా చౌకగా కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత పునరుత్పాదక ఇంధన పవర్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది.​​​​​​​
  • Palm Oil Exports: పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
  • ఆంధ్రప్రదేశ్‌ లో 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తనలో యావత్‌ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది.   – అమితాబ్‌కాంత్, నీతి ఆయోగ్‌ సీఈవో
Published date : 25 May 2022 07:12PM

Photo Stories