Dairy Cooperative Society: ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
పాల ఉత్పత్తుల రంగంలో పేరొందిన దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు సమక్షంలో డిసెంబర్ 29న అమూల్ సంస్థ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో రెండు దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నట్లు ప్రకటించింది. తొలి ప్లాంట్ 5 లక్షల లీటర్ల రోజువారీ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తుండగా, భవిష్యత్‌లో దీన్ని 10 లక్షల లీటర్లకు పెంచే అవకాశముంది. ఈ ప్లాంట్ ద్వా రా బటర్ మిల్క్, పెరుగు, లస్సీ, స్వీట్ల వంటివి తయారుచేస్తారు. దీంతో పాటు తమ బేకరీ ప్రొడక్షన్ డివిజన్‌ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కట్లు, ఇతర బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తామని సంస్థ ప్రకటించింది. 18 నుంచి 24 నెలల్లోపు కార్యకలాపాలు ప్రారంభించే ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే సేకరిస్తామని అమూల్ ప్రతినిధులు పేర్కొన్నారు.
చదవండి: ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటుకానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.500 కోట్ల పెట్టుబడితో తయారీ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : బటర్ మిల్క్, పెరుగు, లస్సీ, స్వీట్ల వంటి పాల ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్