Skip to main content

5th India Agri Business Summit – 2022: దేశవ్యాప్తంగా ఆర్బీకేలు(వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు)

సాక్షి, అమరావతి: వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందు కు, నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన అద్భుత వ్యవస్థ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు).
5th India Agri Business Summit – 2022
5th India Agri Business Summit – 2022

రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు, డిజిటల్‌ కియోస్క్‌లపై అధ్యయనం చేశా యి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది. 

Also read: Global Investor Summit 2023: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌–2023

నవంబర్ 9న న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ– పూస)లో ప్రారంభమైన మూడు రోజుల 5వ ఇండియా అగ్రి బిజినెస్‌ సమ్మిట్‌–2022 సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఈ విషయం చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన జాతీయ అగ్రి ఎక్స్‌పోలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆర్బీకేల నమూనా, డిజిటల్‌ కియోస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలు, డిజిటల్‌ కియోస్క్‌ల పనితీరును కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌తో పాటు ఫిలిప్పైన్స్‌ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విలియం దార్, రోమన్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ మహారాజ్‌ ముతూ, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంజే ఖాన్, సలహాదారు ఎన్‌కే దడ్లాని, నేషనల్‌ రెయిన్‌ ఫెడ్‌ ఏరియా అథారిటీ (ఎన్‌ఆర్‌ఏఏ) సీఈవో అశోక్‌ దాల్వాయి తదితరులు అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆర్బీకే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇదే తరహా సేవలను దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే చెప్పారు. 

Also read: Assago Bio Ethanol Plant: రాజమహేంద్రవరానికి సమీపంలో రూ.270 కోట్లతో అస్సాగో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు..

ఆర్బీకేలు, వాటిలోని కియోస్క్‌లు వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చే వినూత్న మైన పరిజ్ఞానమని ఆయన కొనియాడారు. ‘ఏపీ ఆర్బీకేల గురించి చాలా వింటున్నాం. వాటి ద్వారా అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీకేల్లో డిజిటల్‌ కియోస్క్‌ల ద్వారా ఇన్‌పుట్స్‌ బుకింగ్‌ విధానం అద్భుతం. వాటిని జాతీయ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో వీటిని గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా’ అని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని, డిసెంబరుకల్లా డిజిటల్‌ కియో స్క్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సదస్సుకు వచ్చిన మధ్యప్రదేశ్‌ వ్యవసాయ శాఖ ఉన్నతాధి కారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Also read: Arogyasri 2.0 : రెట్టింపు భరోసా - ఇక 3,255 చికిత్సలకు వర్తింపు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Nov 2022 03:40PM

Photo Stories