Global Investor Summit 2023: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్–2023
కోవిడ్ సంక్షోభం కారణంగా రెండేళ్ల నుంచి ఎటువంటి పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహిస్తున్న తొలి సదస్సు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్–2023 వివరాలను తెలియజేయడానికి నవంబర్ 8న ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు భిన్నంగా ఈ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వంలో రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవ రూపంలోకి వచ్చింది రూ.40,000 కోట్లే అని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లక్ష్యాలు లేకుండా, వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించి మాత్రమే ఒప్పందం చేసుకుంటామన్నారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 లోగోను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP