Weekly Current Affairs (Science & Technology) Quiz (21-27 May 2023)
1. ఇజ్రాయెల్, భారత్ ఏ సంస్థలో భాగస్వామ్యంతో వాటర్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి?
ఎ. ఐఐటీ మద్రాస్
బి. ఐఐటీ కాన్పూర్
సి. ఐఐటీ ముంబై
డి. ఐఐటీ ఢిల్లీ
- View Answer
- Answer: ఎ
2. యూరోపియన్ యూనియన్ వద్ద జిఐ ట్యాగ్ కోసం ఏ రాష్ట్రానికి చెందిన ప్రత్యేకమైన కాంగ్రా టీ(Kangra tea) రిజిస్టర్ చేయబడింది?
ఎ. సిక్కిం
బి. తమిళనాడు
సి. హిమాచల్ ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: సి
3. కిందివాటిలో కల్వరి తరగతికి చెందిన ఆరవ జలాంతర్గామి ఏది?
ఎ. ఖండేరి
బి.కరంజ్
సి.వెల
డి.వాఘ్షీర్(Vaghsheer)
- View Answer
- Answer: డి
4. 'ఎన్వీఎస్-01 నావిగేషన్ శాటిలైట్'ను ప్రయోగించనున్న దేశం ఏది?
ఎ. ఆస్ట్రేలియా
బి. భారతదేశం
సి. ఉగాండా
డి. పోలాండ్
- View Answer
- Answer: బి
5. కునో నేషనల్ పార్క్ ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఇటీవల మరో మూడు చిరుతలను అడవిలో విడిచిపెట్టారు?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. అరుణాచల్ ప్రదేశ్
సి. ఆంధ్ర ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
6. ఇటీవల గూగుల్ క్లౌడ్‌తో భాగస్వామ్యాన్ని పెంచుకున్న భారతీయ కంపెనీ ఏది?
ఎ. అమెజాన్
బి. గూగుల్ ఇండియా
సి. ఫ్లిప్‌కార్ట్
డి. టిసిఎస్
- View Answer
- Answer: డి
7. వండలూరులోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (ఏఏజెడ్పీ) ఏ నగరంలో ఉంది?
ఎ. చెన్నై
బి.అహ్మదాబాద్
సి.జైపూర్
డి. సిమ్లా
- View Answer
- Answer: ఎ
8. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు ప్రయాణం ప్రారంభించిన రయానా బర్నవి ఏ దేశానికి చెందినవారు?
ఎ. UAE
బి. భారతదేశం
సి. సౌదీ అరేబియా
డి. ఇజ్రాయిల్
- View Answer
- Answer: సి
9. మీయోగైన్ అరుణాచలంసిస్(Meiogyne arunachalensis) అనే కొత్త జాతి వృక్షాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఎ. ఒడిశా
బి. బీహార్
సి. తెలంగాణ
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
10. ప్రతిష్ఠాత్మక టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటర్ జాబితాలో 75వ స్థానాన్ని దక్కించుకున్న భారతీయ సూపర్ కంప్యూటర్ ఏది?
ఎ. ప్రఖర్
బి.ప్రత్యూష్
సి. MIHIR
డి.ఐరావత్
- View Answer
- Answer: డి
11. దేశీయ విమానాలను నిషేధించి, రైలు ప్రయాణాలను ఎంచుకోవడానికి ప్రయాణికులను ప్రోత్సహించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఏ దేశం గణనీయమైన ముందడుగు వేసింది?
ఎ. భారతదేశం
బి. స్విట్జర్లాండ్
సి. ఫ్రాన్స్
డి. రష్యా
- View Answer
- Answer: సి
12. ఇటీవల అంతరిక్షంలోని ప్రత్యేకమైన మైక్రోగ్రావిటీ వాతావరణంలో క్యాన్సర్ పై ప్రయోగాలు నిర్వహించడానికి ప్రారంభించిన మిషన్ ఏది?
ఎ. యాక్సియోమ్ మిషన్ 2(Axiom Mission 2)
బి. COBE
సి.వాయేజర్ 2
డి. అపోలో 7
- View Answer
- Answer: ఎ
13. వాతావరణ సూచనల కోసం భారత్ కొత్తగా ఎన్ని పెటాఫ్లోప్(petaFLOP) సూపర్ కంప్యూటర్లను ప్రయోగించబోతోంది?
ఎ. 20
బి. 28
సి. 30
డి. 18
- View Answer
- Answer: డి
14. యుబిఐ గ్లోబల్ ద్వారా ప్రపంచంలోనే నెం.1 పబ్లిక్ బిజినెస్ ఇంక్యుబేటర్ గా ఏ రాష్ట్ర స్టార్టప్ మిషన్ (కెఎస్ యుఎమ్) గుర్తించారు?
ఎ. అస్సాం
బి. సిక్కిం
సి. కేరళ
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
15. మొట్టమొదటి అర్బన్ క్లైమేట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభం కానుంది?
ఎ. డెహ్రాడూన్
బి. కోల్‌కతా
సి.పుణె
డి. సూరత్
- View Answer
- Answer: బి
16. 'ఖేబర్' కొత్త తరం బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
ఎ. ఇండోనేషియా
బి. ఇటలీ
సి. ఇరాక్
డి. ఇరాన్
- View Answer
- Answer: డి
17. రాష్ట్రంలో రోడ్లను గుంతలు లేకుండా చేయడానికి 'ప్యాచ్ రిపోర్టింగ్ యాప్'ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. రాజస్థాన్
బి. గుజరాత్
సి. ఉత్తరాఖండ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
18. పోపోకాటెపెట్(Popocatepetl) అగ్నిపర్వతం ఏ దేశంలో పేలింది?
ఎ. జపాన్
బి. కెనడా
సి. టోంగా
డి. మెక్సికో
- View Answer
- Answer: డి
19. క్లారియన్-క్లిప్పర్టన్ జోన్ (సీసీజెడ్) వద్ద 5,000 కొత్త జాతులను ఏ సముద్ర పరిశోధకులు కనుగొన్నారు?
ఎ. హిందూ మహాసముద్రం
బి. ఆర్కిటిక్ మహాసముద్రం
సి. దక్షిణ మహాసముద్రం
డి. పసిఫిక్ మహాసముద్రం
- View Answer
- Answer: డి