వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (28 May - 03 June 2023)
1. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 8వ సమావేశం ఏ నగరంలో జరిగింది?
ఎ. అమృత్సర్
బి. ముంబై
సి. న్యూఢిల్లీ
డి. హైదరాబాద్
- View Answer
- Answer: సి
2. NPS కింద డిపాజిట్ చేసిన ₹9,242.6 కోట్లను తిరిగి ఇచ్చేలా PFRDAని ఆదేశించాలని కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరింది?
ఎ. తెలంగాణ
బి. హిమాచల్ ప్రదేశ్
సి. పంజాబ్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: బి
3. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) ఏ నగరంలో మెగా 'యోగా ఫెస్టివల్'ని నిర్వహించింది?
ఎ. బెంగళూరు
బి. హైదరాబాద్
సి. జైపూర్
డి. గౌహతి
- View Answer
- Answer: బి
4. నూతన లోక్‌సభా భవనం గేట్లలో ఈ కింది వాటిలో లేని గేట్ ఏది?
ఎ. జ్ఞాన్ ద్వార్
బి. ముక్తి ద్వార్
సి. శక్తి ద్వార్
డి. కర్మ ద్వార్
- View Answer
- Answer: బి
5. 2012తో పోల్చితే 2022లో ఎన్ని కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల తగ్గింది?
ఎ. 1.3 కోట్లు
బి. 1.4 కోట్లు
సి. 1.5 కోట్లు
డి. 1.6 కోట్లు
- View Answer
- Answer: డి
6. 50,000 గ్రామ పంచాయతీలలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏ పథకం ప్రారంభించారు?
ఎ. సమర్థ అభియాన్
బి. PM ఆశా
సి. మిషన్ కర్మయోగి
డి. రాష్ట్రీయ గోకుల్ మిషన్
- View Answer
- Answer: ఎ
7. సుదర్శన్ శక్తి విన్యాసాలను ఏ రెండు రాష్ట్రాల మధ్య నిర్వహించారు?
ఎ. మహారాష్ట్ర, గోవా
బి. జార్ఖండ్, మహారాష్ట్ర
సి. పంజాబ్, రాజస్థాన్
డి. కర్ణాటక, గుజరాత్
- View Answer
- Answer: సి
8. G-20 అవినీతి నిరోధక సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
ఎ. రాంనగర్
బి. దేవప్రయాగ్
సి. రిషికేశ్
డి. రాణిఖేత్
- View Answer
- Answer: సి
9. ఇటీవల ఏ రాష్ట్రం/యూటీలో ఖీర్ భవానీ మేళా నిర్వహించారు?
ఎ. జమ్మూ & కాశ్మీర్
బి. గుజరాత్
సి. త్రిపుర
డి. తమిళనాడు
- View Answer
- Answer: ఎ
10. 14వ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్, 8వ మిషన్ ఇన్నోవేషన్ మీటింగ్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
ఎ. మిజోరాం
బి. గోవా
సి. పంజాబ్
డి. గుజరాత్
- View Answer
- Answer: బి
11. ప్రధానమంత్రి భద్రతా బాధ్యతలను ఏ సంస్థ పర్యవేక్షిస్తోంది?
ఎ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్
బి. సరిహద్దు భద్రతా సేవలు
సి. ఇంటెలిజెన్స్ బ్యూరో
డి. నేషనల్ డిఫెన్స్ సర్వీసెస్
- View Answer
- Answer: ఎ
12. 'కావేరీ 2.0' వెబ్ ఆధారిత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను ఏ నగరం ప్రారంభించనుంది?
ఎ. ముంబై
బి. చెన్నై
సి. బెంగళూరు
డి. హైదరాబాద్
- View Answer
- Answer: సి
13. 'ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన' కింద 100% కవరేజీని సాధించిన రాష్ట్రం ఏది?
ఎ. త్రిపుర
బి. మిజోరాం
సి. తెలంగాణ
డి. మేఘాలయ
- View Answer
- Answer: సి
14. 'మో ఘరా గృహ నిర్మాణ పథకాన్ని' ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. బీహార్
బి. ఒడిశా
సి. రాజస్థాన్
డి. సిక్కిం
- View Answer
- Answer: బి
15. 'కిసాన్ సమ్మాన్ నిధి' కింద ఏ రాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 అందుకుంటారు?
ఎ. అస్సాం
బి. ఒడిశా
సి. సిక్కిం
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
16. అటల్ భూజల్ మిషన్ ఎన్ని సంవత్సరాలు పొడిగించబడింది?
ఎ. 4 సంవత్సరాలు
బి. 3 సంవత్సరాలు
సి. 2 సంవత్సరాలు
డి. 1 సంవత్సరం
- View Answer
- Answer: సి
17. ఏ రాష్ట్ర ప్రభుత్వం జెండర్-ఇన్‌క్లూజివ్ టూరిజం పాలసీ 'ఆయ్'ని ఆమోదించింది?
ఎ. మణిపూర్
బి. మహారాష్ట్ర
సి. సిక్కిం
డి. ఒడిశా
- View Answer
- Answer: బి
18. MSMEల కోసం 15 రోజుల మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ. మేఘాలయ
బి. ఉత్తర ప్రదేశ్
సి. అస్సాం
డి. కేరళ
- View Answer
- Answer: బి
19. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన దిశ మొబైల్ యాప్ ఎన్ని కోట్ల రిజిస్ట్రేషన్లను అందుకుంది?
ఎ. 1.15 కోట్లు
బి. 1.17 కోట్లు
సి. 1.16 కోట్లు
డి. 1.14 కోట్లు
- View Answer
- Answer: బి
20. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయం భారతదేశంలో ఏ నగరంలో ప్రారంభిస్తున్నారు?
ఎ. వారణాసి
బి. న్యూఢిల్లీ
సి. హైదరాబాద్
డి. జైపూర్
- View Answer
- Answer: బి
21. ఏ రాష్ట్రం ఏర్పడి జూన్ 02 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
ఎ. పంజాబ్
బి. గుజరాత్
సి. తెలంగాణ
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి