కరెంట్ అఫైర్స్(2019, మార్చి, 08-15)
1. ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ కోసం ‘వన్ నేషన్ , వన్ కార్డ్' పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. ముంబై, మహారాష్ట్ర
2. కోల్‌కతా, పశ్చిమబంగా
3. అహ్మదాబాద్, గుజరాత్
4. చెన్నై, తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
2. 60 ఏళ్లు పైబడిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3వేల పెన్షన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ పథకం పేరు?
1. ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్‌ధన్ యోజన
2. ప్రధాన మంత్రి వయోజన యోజన
3. ప్రధాన మంత్రి వయోజన శ్రామిక్ యోజన
4. ప్రధాన మంత్రి శ్రామిక్ యోజన
- View Answer
- సమాధానం: 1
3. న్యూఢిల్లీలో జరిగిన ‘స్వచ్ఛ్ సర్వేక్షన్ 2019’ కారక్రమంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా మూడోసారి అవార్డు దక్కించుకున్న నగరం?
1. ఇండోర్
2. విశాఖపట్నం
3. వరంగల్
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
4. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ )రెండు కొత్త బెంచీలను ఏ ఏ నగరాల్లో ఏర్పాటు చేసింది?
1. అమరావతి, ఇండోర్
2. అమరావతి, హైదరాబాద్
3. బెంగళూరు, చెన్నై
4. హైదరాబాద్, చెన్నై
- View Answer
- సమాధానం: 1
5. పండిట్ దీన్‌దయాల్ ఉపాథ్యాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. ముంబై, మహారాష్ట్ర
2. గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
3. లక్నవూ, ఉత్తరప్రదేశ్
4. నాగ్‌పూర్, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
6. ఆయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1. శ్రీరాం పంచు
2.ఎఫ్.ఎమ్. కలీఫుల్లా
3. శ్రీ రవి శంకర్
4. రంజన్ గొగోయ్
- View Answer
- సమాధానం: 2
7. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద అత్యధికంగా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు కలిగిన రాష్ట్రం?
1. పశ్చిమ బంగా
2. బీహార్
3. ఉత్తరప్రదేశ్
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
8. భారతదేశపు మొదటి లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్ అండ్ క్వీర్(ఎల్జీబీటీక్యూ) క్లినిక్, హెచ్ఐవీ సెంటర్‌ను హమ్‌సఫర్ ట్రస్ట్ ఎక్కడ ప్రారంభించింది?
1. ముంబై
2. చెన్నై
3. కోల్‌కతా
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
9. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)లో ఇటీవల 124వ సభ్య దేశంగా చేరిన దేశం?
1. మంగోలియా
2. మలేషియా
3. ఇండోనేషియా
4. టర్కీ
- View Answer
- సమాధానం: 2
10. ఏ రంగంలో సహకారం కోసం ఇటీవల భారత్, జర్మనీ ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1. పౌర, వాణిజ్య అంశాలు
2. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం
3. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం
4. క్యాన్సర్ రీసెర్చ్ ఇనిషియేటివ్
- View Answer
- సమాధానం: 1
11. భారత్- జపాన్ మధ్య తొలి స్పేస్ డైలాగ్ (అంతరిక్ష సంభాషణ) ఎక్కడ జరిగింది?
1. టోక్యో
2. ముంబై
3. న్యూఢిల్లీ
4. ఒసాకా
- View Answer
- సమాధానం: 1
12. సామాజిక సంక్షేమం, ఆరోగ్య సంస్కరణలో కీలకమైన విధాన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడంతో ఏ దేశంలోని మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసింది?
1.ఫిన్లాండ్
2. స్వీడన్
3. నార్వే
4. స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 1
13.యువతకు వృత్తి విద్యలో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత్‌తో కలిసి పనిచేయనున్న దేశం?
1. అమెరికా
2. ఫిన్లాండ్
3. జర్మనీ
4. ఇటలీ
- View Answer
- సమాధానం: 3
14. 1961లో దౌత్య సంబంధాల ఏర్పాటు తర్వాత పరాగ్వేను సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి బృందానికి నాయకత్వం వహించినది ఎవరు?
1. నరేంద్ర మోదీ
2. ఎం. వెంకయ్యనాయుడు
3. రామ్‌నాథ్ కోవింద్
4. సుష్మా స్వరాజ్
- View Answer
- సమాధానం: 2
15. మార్కుల అలంకారిక అంశాల కోసం అంతర్జాతీయ వర్గీకరణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఒప్పందం ఏది?
1. వియన్నా ఒప్పందం
2. నైస్ ఒప్పందం
3. లొకార్నో ఒప్పందం
4. సైట్‌కీ ఒప్పందం
- View Answer
- సమాధానం: 1
16. భారత్- ఒమన్ మధ్య ఒమన్‌లోని జబల్ అలే అఖ్దర్ పర్వతాల్లో జరిగిన సంయుక్త వ్యాయామం పేరు?
1. సర్వదా విజయ్
2. అజేయ వారియర్- 4
3. శూర్ వీర్
4. అల్ నగాహ్- 3
- View Answer
- సమాధానం: 4
17. దరలను పోల్చే సైట్- కేబుల్ డాట్ సీవో డాట్ యూకే(cable.co.uk) ప్రకారం ప్రపంచంలో అత్యంత చవకగా మొబైల్ డేటాను అందించే దేశం?
1. భారత్
2.ై చెనా
3. స్వీడన్
4.జర్మనీ
- View Answer
- సమాధానం: 1
18. ఆరోగ్యరక్షణ నాణ్యతాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 2200 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
19. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి(సీఎంఐఈ) పకారం 2019, ఫిబ్రవరిలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం పెరిగింది?
1. 6.5 శాతం
2. 7.0 శాతం
3. 7.1 శాతం
4. 7.2 శాతం
- View Answer
- సమాధానం: 4
20. ఏ రాష్ట్రంలో కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు(624 మెగావాట్ల)ను నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. పంజాబ్
2. హిమాచల్ ప్రదేశ్
3. జమ్మూకశ్మీర్
4. ఒడిశా
- View Answer
- సమాధానం: 3
21. ఘన ప్లాస్టిక్ వ్యర్థాలు/మిగులు దిగుమతిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన దేశం?
1. జపాన్
2. రష్యా
3. అమెరికా
4. భారత్
- View Answer
- సమాధానం: 4
22. ఏ ఏటీఎంలు నేరుగా సెంట్రల్ బ్యాంక్ నుండి నగదు పొందేందుకు ఆర్బీఐ వ్యాపార మార్గదర్శకాలను సడలించింది?
1. వైట్ లేబుల్ ఏటీఎం
2. గ్రీన్ లేబుల్ ఏటీఎం
3. యెల్లో లేబుల్ ఏటీఎం
4. పింక్ లేబుల్ ఏటీఎం
- View Answer
- సమాధానం: 1
23. మాన్స్టర్ శాలరీ ఇండెక్స్(ఎమ్ఎస్ఐ) సర్వే ప్రకారం ఏ దేశంలో అత్యధికంగా జెండర్ పే గ్యాప్(జీపీజీ)- వల్ల మహిళల సంపాదన పురుఫుల కంటే 19 శాతం తక్కువగా ఉంది?
1. సింగపూర్
2. పాకిస్తాన్
3. బంగ్లాదేశ్
4. భారత్
- View Answer
- సమాధానం: 4
24. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం రూ. 4100 కోట్ల రుణాన్ని ఇవ్వనున్న బ్యాంక్?
1. కొరియా ఎగ్జిమ్ బ్యాంక్
2. భారతీయ రిజర్వ్ బ్యాంక్
3. ప్రపంచ బ్యాంక్
4. ఆసియా అభివృద్ధి బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
25. ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అక్టోబర్- డిసెంబర్ 2018 త్రైమాసికంలో ప్రభుత్వ మొత్తం లయబిలిటీస్ ఎంత పెరిగాయి?
1. రూ. 81.50 లక్షల కోట్లు
2. రూ. 83.40 లక్షల కోట్లు
3. రూ. 85.70 లక్షల కోట్లు
4. రూ. 87.50 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
26. కేవలం 59 నిమిషాల్లో 1600 ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. 689 కోట్ల రుణాన్ని డెడికేటెడ్ పోర్టల్ ద్వారా మంజూరు చేసిన బ్యాంక్?
1. భారతీయ స్టేట్ బ్యాంక్
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్
3. ఇండియన్ బ్యాంక్
4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
27. మహారాష్ట్రలో 44 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ, అమలుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1. అమెరికా
2. సౌదీ అరేబియా
3. రష్యా
4. జపాన్
- View Answer
- సమాధానం: 2
28. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం 2014-2018 మధ్యలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం?
1. సౌదీ అరేబియా
2. భారత్
3. ఈజిప్టు
4. ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
29. ఇథియోపియా విమాన దుర్ఘటన తర్వాత భారత్ ఏ విమానాలను నిషేధించింది?
1. బోయింగ్ 777 మాక్స్ 200
2. బోయింగ్ 747 మాక్స్ 400
3. బోయింగ్ 737 మాక్స్ 8
4. బోయింగ్ 742 మాక్స్ 100
- View Answer
- సమాధానం: 3
30. మార్చి 12న ఏ బ్యాంక్ తన 114వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది?
1. కార్పొరేషన్ బ్యాంక్
2. బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. ఇండియన్ బ్యాంక్
4. కెనరా బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
31. 6 లక్షల కోట్లు రూపాయలు(రూ. 6 ట్రిలియన్) మార్కెట్ విలువ సాధించిన మూడవ భారతీయ కంపెనీ?
1. భారతీయ స్టేట్ బ్యాంక్
2. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
3. ఐసీఐసీఐ బ్యాంక్
4. యాక్సిస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
32. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం బంగారం నిల్వల్లో భారత్ ర్యాంక్?
1. 1
2. 4
3. 9
4. 11
- View Answer
- సమాధానం: 4
33. భారత్‌లో పిల్లల చదువు, అవగాహనా నైపుణ్యాల కోసం గూగుల్ ప్రారంభించిన యాప్?
1. లిఖో
2. పడో
3. బోలో
4. సీఖో
- View Answer
- సమాధానం: 3
34. ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సీఎన్ఈఎస్, ఇస్రో ఏ వ్యవస్థ అభివృద్ధి కోసం బెంగళూరులో ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1. లెబోరేటరీ ఫర్ ఎలక్ట్రో- ఆప్టిక్స్ సిస్టమ్స్
2. ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్
3. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్
4. స్పేస్ బేస్డ్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ సిస్టమ్
- View Answer
- సమాధానం: 4
35. ఇటీవల వార్తల్లో నిలిచిన బేరీషీట్ స్పేస్‌క్రాఫ్ట్ ఏ దేశానికి చెందినది?
1. అమెరికా
2. రష్యా
3. చైనా
4. ఇజ్రాయిల్
- View Answer
- సమాధానం: 4
36. నకిలీ నోట్లను గుర్తించేందుకు ఏ సంస్థ విద్యార్ధులు ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు?
1. ఐఐటీ-ఢిల్లీ
2. ఐఐటీ-ఖరగ్‌పూర్
3. ఐఐటీ-బాంబే
4. ఐఐటీ- కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
37. మూడు బిలియన్ అమెరికా డాలర్ల విలువైన అణుశక్తి జలంతర్గామి- చక్ర-3ని భారత సైన్యానికి పదేళ్ల పాటు లీజుకివ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1. రష్యా
2. అమెరికా
3. ఇజ్రాయిల్
4. చైనా
- View Answer
- సమాధానం: 1
38. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ పొందిన మారయూర్ బెల్లం ఏ ప్రాంతానికి చెందినది?
1. చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
2. పుర్బా మిదినీపూర్, పశ్చిమబంగా
3. ఇడుక్కి, కేరళ
4. కొడగు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
39. ఎస్ఓవీ-(సావరిన్) అనే డిజిటల్ కరెన్సీని విడుదల చేయడానికి ప్రణాళిక రచిస్తున్న దేశం?
1. మార్షల్ ఐలాండ్స్
2. పాపువా న్యూ గినియా
3. న్యూజిలాండ్
4. ఫిజి
- View Answer
- సమాధానం: 1
40. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఇటీవలే తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన ఏ వస్తువుకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది?
1. సంగుడి
2. జమక్కలం
3. పసుపు
4. వెట్ గ్రైండర్
- View Answer
- సమాధానం: 3
41. గెడైడ్ పినాక వెపన్స్ సిస్టమ్‌ను డీఆర్డీఓ ఎక్కడ నుండి పరీక్షించింది?
1. ఛాందీపూర్, ఒడిశా
2. పోఖ్రాన్, రాజస్థాన్
3. శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్
4. తిరువనంతపురం, కేరళ
- View Answer
- సమాధానం: 2
42. ఇటీవల రామ్సర్ కన్వెన్షన్‌లో ‘అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన తడినేల’ హోదా పొందిన ప్రాంతం?
1. ట్సోమోరిరీ
2. సుందరబన్స్
3. కాంజ్‌లీ
4. రోపర్
- View Answer
- సమాధానం: 2
43. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(ఎన్ఏఎల్ఎస్ఏ) ఎక్సిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎవరిని నామినేట్ చేశారు?
1. శరద్ అరవింద్ బోడ్బీ
2.ఎన్.వి. రమణ
3. అరుణ్‌కుమార్ మిశ్రా
4.రోహిన్టన్ ఫాలీ నారీమన్
- View Answer
- సమాధానం: 1
44. బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. విజయ్ దీక్షిత్
2. అజిత్ కుమార్ మొహంతి
3. హరీశ్ జైన్
4. సంతోష్ శర్మ
- View Answer
- సమాధానం: 2
45. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూన్‌డీపీ) గుడ్‌విల్ అంబాసిడర్గాఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1. రవీనా టాండన్
2. పద్మా లక్ష్మి
3. రోహిత్ శర్మ
4. ఎం.ఎస్ ధోని
- View Answer
- సమాధానం: 2
46. ఫైనాన్స్ సెక్రెటరీ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు?
1. హష్ముఖ్ అథియా
2. సుభాశ్ చంద్ర గార్గ్
3. అశోక్ లావాస
4. బిమల్ జలాన్
- View Answer
- సమాధానం: 2
47. పాలస్తీనా ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. అహ్మద్ ఖురీ
2. ఇస్మాయిల్ హనియే
3. సలాం ఫయ్యద్
4. మొహమ్మద్ స్టయ్యే
- View Answer
- సమాధానం: 4
48. విశాఖపట్నంలో కొత్త జోన్ ఏర్పాటు కోసం దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా ఎవరు నియమితులయ్యారు?
1. ఎస్. ఎస్. శ్రీనివాస్
2. సంజీవ్ కుమార్
3. హనీష్ యాదవ్
4. అనుజ్ గుప్తా
- View Answer
- సమాధానం: 1
49. భారత 61వ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
1. అభిజీత్ గుప్త
2. ఇనియాన్ పన్నీర్‌సెల్వం
3. కృష్ణన్ శశికిరణ్
4. పెంటల హరికృష్ణ
- View Answer
- సమాధానం: 2
50. దేశంలో తొలి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
2. తిరువనంతపురం, కేరళ
3. పనాజీ, గోవా
4. కొచ్చి, కేరళ
- View Answer
- సమాధానం: 1