కరెంట్ అఫైర్స్(2018, డిసెంబర్ 14 - 20) బిట్ బ్యాంక్
1. స్త్రీ, శిశు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన పార్ట్నర్స్ ఫోరం నాలుగో సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) కోల్‌కతా
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) పూణె
- View Answer
- సమాధానం: 3
2. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ‘ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజనా (సౌభాగ్య)’ కింద ఎన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి గృహ విద్యుదీకరణను సాధించాయి?
1) 15
2) 12
3) 11
4) 9
- View Answer
- సమాధానం: 4
3. సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర హోం శాఖ ప్రారంభించిన ట్విట్టర్ అకౌంట్ పేరేమిటి?
1) @సైబర్‌దోస్త్
2) @ సైబర్నేస్తం
3) @ సైబర్వాచ్
4) @ సైబర్కాప్స్
- View Answer
- సమాధానం: 1
4. ఈ- ఫార్మాసిస్టులు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా ఔషధాలను విక్రయించడాన్ని నిషేధిస్తూ ఏ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది?
1) మధ్యప్రదేశ్ హైకోర్టు
2) ఢిల్లీ హైకోర్టు
3) మహారాష్ట్ర హైకోర్టు
4) ఉత్తరప్రదేశ్ హైకోర్టు
- View Answer
- సమాధానం: 2
5.2018 నవంబర్ నాటికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.193.34 కోట్లతో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక
4) పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 4
6. ‘ఇంక్రీజింగ్ యాక్సెస్ టు మెడికల్ డివెజైస్’ పేరుతో వైద్య పరికరాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ఫోరం 4వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) పాట్నా, బిహార్
2) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
3) గువాహటి, అసోం
4) కోల్‌కతా, పశ్చిమ బంగా
- View Answer
- సమాధానం: 2
7.నేరాలను అరికట్టడం, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ‘ప్రహరి’ పేరుతో ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) గోవా
3) పుదుచ్చేరి
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
8. భారతీయ వ్యవసాయంపై మహిళల ప్రభావం నేపథ్యంతో దూరదర్శన్ కిసాన్ ప్రారంభించిన తొలి రియాలిటీ షో పేరు?
1) మహిళా దేశ్
2) మహిళా కిసాన్ అవార్డ్స్
3) మహిళా శక్తి
4) మహిళా పురస్కార్
- View Answer
- సమాధానం: 2
9. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 5 రోజుల మయన్మార్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి?
1) 2
2) 4
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 1
10. సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా.. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పీవోఎస్‌బీ) వినియోగదారుల కోసం ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఎక్కడ ప్రారంభించారు?
1) కోల్‌కతా
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 2
11. పేలుడు పదార్థాల గుర్తింపునకు సంబంధించి తొలి జాతీయ వర్కషాప్ (నేషనల్ వర్్ంషాప్ ఆన్ ఎక్స్‌ప్లోజీవ్ డిటెక్షన్) ఎక్కడ జరిగింది?
1) పూణె, మహారాష్ట్ర
2) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
3) హైదరాబాద్, తెలంగాణ
4) సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
12. కోర్టు ఫీజులు, జ్యుడీషియల్ డిపాజిట్లు, ఫైన్లు, పెనాల్టీలను ఈ- చెల్లింపుల ద్వారా అనుమతించిన భారత్‌లోని తొలి జిల్లా కోర్టు ఏది?
1) ఇండోర్ జిల్లా కోర్టు
2) మంగళూరు జిల్లా కోర్టు
3) విశాఖపట్నం జిల్లా కోర్టు
4) పూణె జిల్లా కోర్టు
- View Answer
- సమాధానం: 4
13. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కుంభమేళా కోసం ఏ విమానాశ్రయ సముదాయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు?
1) హరిద్వార్, ఉత్తరాఖండ్
2) నాశిక్, మహారాష్ట్ర
3) ఉజ్జయిని, మధ్యప్రదేశ్
4) ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
14. చండీగఢ్‌లో మిశ్రమ బయో ఫ్యూయల్‌ను ఉపయోగించి భారత వైమానిక దళం నడిపిన తొలి సైనిక విమానం పేరు?
1) ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్
2) ఏఎన్-49 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్
3) బీఎన్-67 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్
4) టీఎన్-11 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్
- View Answer
- సమాధానం: 1
15. ‘సిలావో ఖాజా’ అనే మిఠాయి ద్వారా ఇటీవల ఏ రాష్ట్రానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది?
1) అసోం
2) బిహార్
3) ఆంధ్రప్రదేశ్
4) పశ్చిమబంగ
- View Answer
- సమాధానం: 2
16. అభివృద్ధి పరచిన ఉమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్ఫార్మ్ 2.0ను ప్రారంభించడంతో పాటు ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్-2018, 3వ ఎడిషన్‌ను నీతీ ఆయోగ్ ఎక్కడ నిర్వహించింది?
1) కోల్‌కతా
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
17. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సాఫ్ట్ పవర్‌పై 3 రోజుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు?
1) కోల్‌కతా
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) బెంగూరు
- View Answer
- సమాధానం: 2
18. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) 39వ సదస్సు ఎక్కడ జరిగింది?
1) దోహా, ఖతార్
2) రియాద్, సౌదీ అరేబియా
3) దుబాయ్, యూఏఈ
4) అమ్మన్, జోర్డాన్
- View Answer
- సమాధానం: 2
19. సైనిక సాంకేతిక సహకారంపై భారత్-రష్యా అంతర్ ప్రభుత్వ మండలి (ఐఆర్ఐజీసీ - ఎంటీసీ) 18వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) డెహ్రాడూన్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 2
20. 2019 ఫిబ్రవరిలో గీతా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించిన దేశం?
1) శ్రీలంక
2) నేపాల్
3) మారిషస్
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 3
21. 2018 డిసెంబర్ 13న 5వ ‘ఎంటర్ప్రైజ్ ఇండియా షో’ ఎక్కడ జరిగింది?
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) మయన్మార్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 4
22. యూరోపియన్ పార్లమెంట్ ఏ దేశంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది?
1) చైనా
2) జపాన్
3) భారత్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
23. భారత్-ఫ్రాన్స్.. ఏ సంవత్సరానికి ఇరు దేశాల మధ్య పదివేల మంది విద్యార్థులను ఇచ్చిపుచ్చుకోవడం (స్టూడెంట్ ఎక్స్ఛేంజ్) జరుగుతుందని ప్రకటించాయి?
1) 2020
2) 2021
3) 2022
4) 2025
- View Answer
- సమాధానం: 1
24. తమ దేశాన్ని ‘గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ టాలరెన్స్’గా నిలిపేందుకు ఐదు స్తంభాల (ఫైవ్ పిల్లర్స్)పై దృష్టి సారిస్తూ 2019ని ‘ఇయర్ ఆఫ్ టాలరెన్స్’గా ప్రకటించిన దేశం ఏది?
1) అమెరికా
2) యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్
3) చైనా
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 2
25. ఏ రంగంలో పరస్పర సహకారానికి భారత్- ఆస్ట్రేలియా ఇటీవల అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1) సముద్ర రక్షణ
2) డిస్‌ఎబిలిటీ సెక్టార్ (వైకల్య రంగం)
3) మహిళా సాధికారికత
4) సౌర శక్తి
- View Answer
- సమాధానం: 2
26. భారత్ - ఇండోనేషియా కోస్ట్‌గార్డ్ ఉన్నత స్థాయి సమావేశం ఎక్కడ ముగిసింది?
1) ముంబై
2) చెన్నై
3) న్యూఢిల్లీ
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 3
27. భారత్ - దక్షిణ కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై 7వ విడత చర్చలు ఎక్కడ జరిగాయి?
1) ముంబై, భారత్
2) న్యూఢిల్లీ, భారత్
3) సియోల్, దక్షిణ కొరియా
4) ప్యాంగ్ఛాంగ్, దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
28. ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్తగా ఏమని నామకరణం చేసింది?
1) ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫార్మ్
2) గ్రోత్ ఇండక్షన్ ప్లాట్ఫార్మ్
3) ట్రేడ్ డెవల్మెంట్ ప్లాట్ఫార్మ్
4) కంపెనీస్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్
- View Answer
- సమాధానం: 1
29. ఏటీ కీర్నే ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) కాన్ఫిడెన్స్ ఇండెక్స్ - 2018 లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 3
2) 6
3) 11
4) 15
- View Answer
- సమాధానం: 3
30. మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీ) తయారీకి తొలిసారిగా ఒక ప్రైవేట్ రంగ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది?
1) ముంబై
2) మంగళూరు
3) ఘజియాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
31. ఐఎంఎఫ్ ప్రకటించిన ప్రపంచ రుణం 182 లక్షల కోట్ల డాలర్ల అంచనా కంటే ఎంత మొత్తానికి పెరిగింది?
1) 184 లక్షల కోట్ల డాలర్లు
2) 220 లక్షల కోట్ల డాలర్లు
3) 225 లక్షల కోట్ల డాలర్లు
4) 275 లక్షల కోట్ల డాలర్లు
- View Answer
- సమాధానం: 1
32. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన ప్రపంచ లింగ అసమతుల్యత నివేదిక-2018 ప్రకారం భారత్ స్థానం?
1) 33
2) 45
3) 99
4) 108
- View Answer
- సమాధానం: 4
33. 2017లో 989 స్వీయ రక్షణ కార్యక్రమాల్లో 2,08,125 మంది మహిళలు, బాలికలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏ రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత పోలీసులు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు?
1) పుదుచ్చెరి
2) ఢిల్లీ
3) ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
34. ప్రపంచ తొలి తేలియాడే అణు ఇంధన కేంద్రాన్ని(ఎఫ్ఎన్పీపీ) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన దేశం?
1) చైనా
2) జపాన్
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 3
35. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల సురక్షిత సంతానోత్పత్తి కోసం భారత తీర ప్రాంత రక్షక దళం ‘ఆపరేషన్ ఆలివా’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1) ఒడిశా
2) అసోం
3) బిహార్
4) పశ్చిమబంగా
- View Answer
- సమాధానం: 1
36. ఎబోలా వైరస్‌తో పోరాడటానికి పరిశోధకులు కనుగొన్న కొత్త మానవ ప్రోటీన్ పేరు ఏమిటి?
1) ఈఆర్పీటీ7
2) ఆర్బీబీపీ6
3) టీహెచ్యూఎల్9
4) జెడ్ఏయూఎన్4
- View Answer
- సమాధానం: 2
37. ఏ తుఫాన్ కాకినాడ వద్ద తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు సంభవించాయి?
1) పెథాయ్
2) ఫీటీ
3) జగ్గో
4) రిషూ
- View Answer
- సమాధానం: 1
38. ఏ దేశంలోని అగ్ని పర్వతం మౌంట్ సోపురట్ పేలడంతో సులవేశీ ద్వీపంలో 7.5 కి.మీ ఎత్తుకు ఆకాశంలో బూడిద ఎగిసిపడింది?
1) మలేషియా
2) ఇండోనేషియా
3) వియత్నాం
4) ఫిలిప్పీన్స్
- View Answer
- సమాధానం: 2
39. అనేక సంవత్సరాల పూర్వమే నాసా, వాయేజర్ 1 - 2 పరిశీలనల ద్వారా అంచనా వేసిన గరిష్ట వేగంతో తన సరూప వలయాలను కోల్పోతున్న గ్రహం ఏది?
1) శుక్రుడు
2) బృహస్పతి
3) శని
4) నెప్ట్యూన్
- View Answer
- సమాధానం: 3
40. మారియం-వెబ్‌స్టర్ డిక్షనరీ ఏ పదాన్ని 2018 పదంగా ఎంపిక చేసింది?
1) టాక్సిక్
2) మిస్-ఇన్ఫర్మేషన్
3) జస్టిస్
4) ట్రావెల్
- View Answer
- సమాధానం: 3
41. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన భారత 39వ సమాచార ఉపగ్రహమైన, 2250 కిలోల సైనిక సమాచార ఉపగ్రహం పేరు?
1) జీశాట్-7ఎ
2) జీశాట్-6ఎ
3) జీశాట్-29సి
4) జీశాట్-11సి
- View Answer
- సమాధానం: 1
42.2018 డిసెంబర్ 13న రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వారు?
1) మహమూద్ అలీ
2) కె. చంద్రశేఖర్ రావు
3) ఇ.ఎస్.ఎల్. నరసింహన్
4) కె. తారక రామారావు
- View Answer
- సమాధానం: 2
43. మిజోరాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వారెవరు?
1) జోరామ్‌తంగా
2) కుమ్మనం రాజశేఖరన్
3) మిన్ హోయ్
4) అన్షల్ సేన్
- View Answer
- సమాధానం: 1
44. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా భోపాల్‌లో ప్రమాణం స్వీకారం చేసిన వారెవరు?
1) కమల్‌నాథ్
2) విశ్వనాథ్ సేథ్
3) జ్యోతిరాదిత్య సింధ్యా
4) అమర్నాథ్ పాటిల్
- View Answer
- సమాధానం: 1
45.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్‌గా 2019 జనవరి 1 నుంచి ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు?
1) సంతోష్ మిశ్రా
2) సందీప్ నాయర్
3) హరీశ్ పరమేశ్
4) ప్రణబ్ కుమార్ దాస్
- View Answer
- సమాధానం: 4
46. 19వ అఖిల భారత పోలీస్ (ఏఐపీడీఎం) షూటింగ్ పోటీలు - 2018ను ఎక్కడ నిర్వహించారు?
1) మనేసర్, హరియాణా
2) మొహాలీ, పంజాబ్
3) మనాలి, హిమాచల్ ప్రదేశ్
4) ముస్సోరీ, ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 1
47. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ఆమోదంతో ఆసియా క్రికెట్ కప్-2020ను నిర్వహించనున్న దేశం?
1) అఫ్గ్గానిస్తాన్
2) పాకిస్తాన్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
48. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 123 పరుగులు చేయడం ద్వారా అత్యంత వేగంగా 25 టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్ ఎవరు?
1) శిఖర్ ధావన్
2) విరాట్ కోహ్లీ
3) రోహిత్ శర్మ
4) పృథ్వీ షా
- View Answer
- సమాధానం: 2
49. గ్వాంరలోని టియాన్హీలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ - 2018, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి?
1) సైనా నెహ్వాల్
2) పి.వి. సింధు
3) అశ్వినీ పొన్నప్ప
4) జ్వాలా గుత్తా
- View Answer
- సమాధానం: 2
50. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ముగిసిన హాకీ ప్రపంచకప్ 14వ ఎడిషన్ గీతం?
1) హాకీ ఏంథమ్
2) జై హింద్
3) ఫైర్ బాల్
4) రాక్ ద గ్రౌండ్
- View Answer
- సమాధానం: 2